
బిగ్ బాస్ సీజన్ 9 మంచి రేటింగ్ సంపాదించుకుంది. ఈ సీజన్ లో డీమన్ పవన్ , పవన్ కళ్యాణ్ కి మంచి పేరొచ్చింది. ఇక టాప్ 3 గా నిలబడ్డాడు కంటెస్టెంట్ డీమన్ పవన్. అలాంటి పవన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పవన్ వాళ్ళ నాన్న మరణించారు. కొంతకాలంగా ఆయన నోటి కాన్సర్ తో బాధపడుతున్న విషయాన్ని పవన్ చాల ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. ఆయన మరణ వార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. బిగ్ బాస్ 3 పోటాపోటీగా టాస్కులు ఆడి తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. బిగ్ బాస్ లో మాస్ మహారాజ రవితేజ ఇచ్చిన 15 లక్షల సూట్ కేసుని తెచ్చేసుకున్నాడు.
ఇక రీతుతో బాగా కనెక్ట్ ఐన పవన్ బయట మిగతా టీవీ షోస్ కి కూడా కలిసి అటెండ్ అవుతున్నాడు. అలాగే బిబి జోడీలో కూడా కంటెస్టెంట్ గా ఈ జోడి అదరగొట్టారు. రీతూ, డీమన్ పవన్ కి ఇప్పుడు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. కలిసి రీల్స్ చేయడం కలిసి షోస్ కి వెళ్లడం చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నారు.








