Home

»

Tv News

Karthika Deepam2: జ్యోత్స్న, పారిజాతంపై దశరథ్ ఫైర్.. శివన్నారాయణ సపోర్ట్ ఉందిగా!

Feb 28, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం-2 (Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-605 లో.. పారిజాతం, జ్యోత్స్న మెడిటేషన్ చేస్తుంటే కార్తీక్ వస్తాడు. పారిజాతాన్ని కాసేపు ఆడుకుంటాడు. అప్పుడే అక్కడికి శివన్నారాయణ రాగానే తనకి మనశ్శాంతి లేదంట కారణం అడిగితే చెప్పుకోలేనివి అని అంటుందని పారిజాతాన్ని ఇరికిస్తాడు కార్తీక్. సుమిత్రకి ఆపరేషన్ జరిగి తను బాగుండాలని నా టెన్షన్ అని పారిజాతం కవర్ చేస్తుంది. అవును నిజమేరా సుమిత్ర మామూలు మనిషి అయ్యేదాకా ఈ గాబరా తప్పదు అని చెప్పేసి శివన్నారాయణ వెళ్ళిపోతాడు. నైస్ కవర్ డ్రైవ్ పారు అని కార్తీక్ అనేసి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత దీప, కార్తీక్ లని సుమిత్ర దగ్గరికి తీసుకెళ్తాడు దశరథ్. అప్పటికే సుమిత్ర పడుకొని ఉంటుంది. ఇదిగో తనే నీ కూతురు అని సుమిత్రతో చెప్తాడు దశరథ్. కానీ తను పడుకొని ఉంటుంది. ఇక కార్తీక్, దీప ఇద్దరు దశరథ్ ని రిక్వెస్ట్ చేస్తారు. ఇక జ్యోత్స్న, పారిజాతం హాల్లో సోఫాలో కూర్చొని ఉంటారు. దీపని కాఫీ తీసుకొని రమ్మని చెప్తుంది పారిజాతం. కాసేపటికి దీప కాఫీ తీసుకొస్తుంటే జ్యోత్స్న కాలు అడ్డుపెడుతుంది దాంతో దీప చేతిలోని  కాఫీ పారిజాతం మీద పడుతుంది. దాంతో దీప మీద పారిజాతం అరుస్తుంది. దీపని పారిజాతం కొట్టబోతుంటే అప్పుడే దశరథ్ వస్తాడు. ఆగు పిన్నీ.. తప్పు ఎవరిది.. దీపని ఎందుకు కొడుతున్నావంటూ అరుస్తాడు. నా మీద కాఫీ పోసిందని అనగానే జ్యోత్స్న కాలు అడ్డుపెట్టింది అందుకే అని దీప చెప్తుంది. నిన్ను అడిగానా నేను.. ఎందుకు సంజాయిషీ చెప్తున్నావని దీపని అంటాడు దశరథ్. జ్యోత్స్న ఎందుకలా చేశావ్ అంటూ తనని కోప్పడతాడు దశరథ్. ఫోన్ చూస్తూ తెలియకుండా కాలు ముందు పెట్టానని జ్యోత్స్న అనగానే తప్పు నువ్వు చేసి దీపని ఎందుకు అంటున్నావ్ పిన్నీ అని పారిజాతం మీద అరుస్తాడు‌ దశరథ్. అయినా దీప పనిమనిషి అని పారిజాతం అంటుంది. తను పనిమనిషి కాదు.. నా మేనల్లుడు కార్తీక్ భార్య.. నా భార్య ప్రాణధాత.. ఆప్తురాలు.. శ్రేయోభిలాషి అని దశరథ్ అంటాడు. అయితే తనకి పని చెప్పొద్దా.. మరి ఈ పనులు ఎవరు చేస్తారని పారిజాతం అనగానే జ్యోత్స్న చేస్తుంది. తన పనులు తనే చేసుకోవాలి.. ఇంటి పని, వంట పని అన్నీ నేర్చుకోవాలి.. ఇప్పుడు కాకపోతే ఇంకో రెండు నెలల్లో అయినా జ్యోత్స్న పెళ్ళి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళాళ్సిందే కదా అని దశరథ్ ఫైర్ అవుతాడు.

నేను చేయను డాడీ అని జ్యోత్స్న అనగానే అయితే పిన్ని చేస్తుందని దశరథ్ అంటాడు. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏం కాకూడదని వార్నింగ్ ఇస్తాడు దశరథ్. ఇక దశరథ్ ని కార్తీక్ బయటకు తీసుకెళ్తాడు. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డని వాళ్ళ అమ్మ అని అనుకుంటున్నాడు.. వాడికి ఆ ఎమోషన్ ఉంది.. దీపకి పనులు ఏం చెప్పకండి అని పారిజాతం , జ్యోత్స్నలకి శివన్నారాయణ చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు దశరథ్ కోపంగా ఉంటే గట్టిగా మాట్లాడకండి మామయ్య అని కార్తీక్ అంటాడు. ఏం అయింది రా నా కూతురు దీప అని తెలియాలని దశరథ్ అనగానే అంటే అత్తయ్య బ్రతకాలని లేదా కార్తీక్ అంటాడు. దాంతో దశరథ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com