
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -406 లో.....సాగర్ కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని వాళ్ళ మావయ్య పార్టీ ఇస్తాడు. పార్టీలో సాగర్ డబ్బు పెట్టి జాబ్ కొన్నాడని నిరూపించి వాళ్ళ పరువు తియ్యాలని శ్రీవల్లి, భాగ్యం ప్లాన్ చేస్తారు. పార్టీకీ వచ్చిన వాళ్లందరికి నా అల్లుడికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని శ్రీనివాస్ గర్వంగా చెప్తుంటే నర్మద మాత్రం డల్ గా ఉంటుంది. ఇంత సంతోషకరమైన పరిస్థితిలో ఇలా ఉన్నావేంటని వేదవతి అడుగుతుంది. ఏం లేదని నర్మద చెప్తుంది.
ఆ తర్వాత నర్మద వాళ్ళ అమ్మ దగ్గరికి శ్రీవల్లి వచ్చి పిన్ని మీకు మతిమరుపు వచ్చింది. నర్మద నగలు మీ ఇంట్లో బీరువాలో పెట్టి తాళం ఎక్కడో మర్చిపోయారంట కదా అని అని అనగానే నర్మద నగలు వాళ్ళ అత్తింట్లోనే ఉన్నాయి.. అలా ఎందుకు చెప్పిందని అనుకుంటుంది. ఆ తర్వాత తను నర్మద దగ్గరికి వెళ్లి నగలు నీ దగ్గరే ఉన్నాయి కదా అలా ఎందుకు చెప్పావని అడుగుతుంది. అవును అలా ఎందుకు చెప్పావని వేదవతి అడుగుతుంది. అత్తయ్య మీరు ఎలా విన్నారో నగలు నా దగ్గర ఉన్నాయి. తాళం ఎక్కడ పెట్టానో మర్చిపోయానని అంటుంది. మీరు ఎలా విన్నారోనని నర్మద అనగానే లేదని శ్రీవల్లి అంటుంటే నర్మద ఎప్పుడు అబద్ధం చెప్పదని వేదవతి అంటుంది. ఆ తర్వాత జాబ్ ఇప్పించే బ్రోకర్ ని శ్రీవల్లి రప్పిస్తుంది. అక్కడ అతన్ని చూసి సాగర్ టెన్షన్ పడతాడు. రిక్వెస్ట్ చేస్తాడు. అలా రిక్వెస్ట్ చెయ్యడం వేదవతికి చూపిస్తుంది. తన పై ఆఫీసర్ అయి ఉంటాడు అత్తయ్య మీరు వెళ్లి సాగర్ ని బాగా చూసుకొమ్మని చెప్పండి అని శ్రీవల్లి వేదవతికి చెప్తుంది. అతని దగ్గరకి వెళ్లి మాట్లాడుతుంది వేదవతి. మీ అబ్బాయికి నేనే జాబ్ ఇప్పించానని అతను అనగానే నర్మద కవర్ చేస్తుంది.
మరొక వైపు భాగ్యం, ఆనందరావు ఇద్దరు కలిసి రామరాజుకి సాగర్ గురించి తెలియాలని ట్రై చేస్తారు. భాగ్యం తన ఫ్రెండ్ ఫోన్ చేసినట్లు యాక్టింగ్ చేస్తుంది. ఏంటి సాగర్ డబ్బులు పెట్టి జాబ్ కొన్నాడా అని అడుగుతుంది. ఏంటి దానికి సంబంధించిన వీడియో కూడా ఉందా అని ఆశ్చర్యంగా మాట్లాడుతుంటే.. రామారాజు ఏమైందని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







