.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1042 లో......కావ్య బెడ్ పై కూర్చొని ఏదో తింటుంటే రాజు తన వంకే చూస్తాడు. ఏంటి అలా చూస్తున్నావ్.. దిష్టి తగులుతుందని ఇందు అంటుంది. నిన్ను చూస్తే కూల్ గా ఉంటావ్.. నన్ను ఎందుకు ఈ స్కామ్ లో ఇరికించావ్.. నువ్వే నన్ను సీఈఓగా పోటీ చెయ్యమని చెప్పి.. ఇప్పుడు నువ్వే ఆ రేఖకి మళ్ళీ వెళ్లి నేను సీఈఓ కావాలని అనుకుంటున్నానని చెప్తున్నావ్.. అసలు నీ ప్లాన్ ఏంటని రాజు అడుగుతాడు. ఇప్పుడు నేను సీఈఓ అంటే రేఖ ఆంటీ ఒప్పుకోదు.. అదే ఈ రూట్ లో వస్తే ఇప్పుడు నిన్ను ఎదురించినడానికి నన్ను సీఈఓని చేస్తుందని ఇందు చెప్తుంది.
మరొకవైపు ఏంటి రేఖ వాడు చెప్పినట్టు చేస్తే తర్వాత మన మాట వినకుండా అవుతాడని భ్రమరాంబ అంటుంది. నాకు ఒక బ్రహ్మస్త్రం ఉంది. దాని ద్వారా మళ్ళీ నేను సీఈఓ అవుతానని రేఖ చెప్తుంది. ఆ తర్వాత ఇప్పుడు రేఖ ఆంటీకి నేను బ్రహ్మస్త్రం నన్ను వాడుకొని సీఈఓ అవ్వాలని ట్రై చేస్తుంది. ఇప్పుడు మనం మా బోర్డు మెంబర్ పరంధామయ్య గారిని కలవాలని రాజుతో ఇందు చెప్తుంది. మరొకవైపు వెంకి డల్ గా ఉన్నాడని నందు అనుకుంటుంది. ఒక అమ్మాయి ఉంది.. ట్రూ లవ్ కోసం చూస్తోందని తనతో మాట్లాడమని వెంకీతో నందు చెప్తుంది. ఇప్పుడు నా మూడ్ బాలేదు.. ఇవన్నీ వద్దు.. నా మొహానికి ఒక ట్రూ లవ్ ఒక్కటే తక్కువ అని వెంకీ అంటాడు. జాబ్ లేకపోతే లైఫ్ లేనట్టు మాట్లాడుతున్నావేంటని నందు అంటుంది.
అప్పుడే ఒక అమ్మాయి వస్తుంది. వెంకీతో మాట్లాడుతుంది. ఇప్పుడు నాకు జాబ్ లేకపోతే నన్ను వదిలేస్తావా అని అడుగుతాడు. వదిలేస్తానని ఆ అమ్మాయి చెప్పగానే చూసావా జనాలు ఎలా ఉన్నారో అని వెంకీ ఆ అమ్మాయిని పంపిస్తాడు. ఆ తర్వాత మదన్ కి స్వాతి ప్రపోజ్ చేస్తుంది. నాకు ఇష్టం లేదు.. మా అమ్మ ఎవరిని చెప్తే వాళ్లని పెళ్లి చేసుకుంటానని మదన్ అంటాడు. ఆ మాటలు అన్నీ ఇందు వింటుంది. స్వాతి దగ్గరికి వస్తుంది. స్వాతి తనని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత స్వాతి ప్రపోజ్ చెయ్యడం రేఖ చూసి మీ అమ్మ నా కొడుకని అల్లుడు చేసుకోవాలని అనుకుంటుంది. స్వాతికి నా కొడుకు అంటే ఇష్టం అన్నమాట.. మీ సంగతి చెప్తానని రేఖ అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

