Home

»

Tv News

రోహిణి బుగ్గపై పదే పదే ముద్దులు పెట్టిన నిఖిల్!

Jun 3, 2026 3:22PM

అసలు కుకింగ్ షో ముద్దులు ఏంటో అర్ధం కావడంలేదు. అది నిఖిల్ విజయేంద్ర సింహ రోహిణి బుగ్గల మీద పడీపడీ ముద్దులు పెట్టేసుకున్నారు. కుక్కు విత్ జాతిరత్నాలు షో అంతా ప్రేమమయమైపోయింది అంటూ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇక ఇందులో అందరూ రకరకాల మూవీస్ లో ఉన్న లవర్స్ గెటప్స్ తో వచ్చారు. రోహిణి - నిఖిల్ విజయేంద్ర సింహ ఐతే టైటానిక్ మూవీలోని హీరో హీరోయిన్ గెటప్స్ తో వచ్చారు.

ఇక నిఖిల్ ఐతే రోహిణిని తెగ ముద్దులు పెట్టేసుకున్నారు. ఊహించని ఆ పరిణామానికి రోహిణి కూడా షాకయ్యింది. జడ్జెస్ కూడా షాకయ్యారు. ఇక పిచ్చకొట్టుడు కొట్టింది రోహిణి నిఖిల్ ని. "ఇప్పటి వరకు నాకు స్టేజి మీద ఎవరూ ముద్దు పెట్టలేదు. ఫస్ట్ టైం ముద్దు పెట్టాడు నేను ఫిక్స్ అయ్యాను. మీ అమ్మతో మాట్లాడి ఒప్పిస్తావా లేదా . ఇక నిన్ను ఒదిలేదు లేదు దా " అనేసింది సీరియస్ గా. ఇక ప్రదీప్ ఐతే "లవ్ థీమ్ రోజున ఒక జంటను కలిపాం అంతకన్నా ఆనందం ఇంకేం కావాలి " అన్నాడు. "నిజ్జంగా చిన్నదై ఉంటే నేను పెళ్లి చేసుకునేవాడిని " అన్నాడు నిఖిల్ . "మర్యాదగా మాట్లాడుకుందాం నాకు నీకు మూడేళ్లు తేడా ఒకే నా కాదా అని భుజం మీద చెయ్యేసి మరీ సీరియస్ గా అడిగింది రోహిణి. "నీకు ఎన్ని అడ్వాంటేజీలు ఉంటాయంటే బిబి జోడి కి వెళ్లొచ్చు బిగ్ బాస్ షో కపుల్స్ అంటే ఇద్దరు వెళ్లొచ్చు మినిమం మనకు ఒక నాలుగు లక్షలు ఇస్తారు నీకొక రెండు లక్షలు ఇస్తారు " అంది రోహిణి. దాంతో జడ్జెస్ అంతా నవ్వేశారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com