Home

»

Tv News

తండ్రి మరణాన్ని గుర్తుచేసుకుని ఏడ్చేసిన తేజస్వి!

Jun 3, 2026 5:44PM

తేజస్వి లైఫ్ చాలా ట్రాజెడీ. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొంది.అలాంటి తేజస్వి తన లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ ని కాకమ్మ కథలు లేటెస్ట్ ప్రోమోలో షేర్ చేసుకుంది. అలాగే ఈ ఎపిసోడ్ కి గెస్టులుగా వచ్చిన సోనియా - సిద్దు కూడా వాళ్ళ వాళ్ళ జీవితాల్లోని కొన్ని బాధాకరమైన సంఘటనలను షేర్ చేసుకున్నారు. "కాకమ్మ రిలీజ్ ఐన రోజు నేను మా నాన్నను పోగొట్టుకున్నాను. స్ట్రెంత్ కోసం ఇక్కడికి వచ్చాను మాట తడబడుతోంది " అంది తేజు. తర్వాత సోనియా కూడా చెప్పింది తన స్టోరీ. "నేను నెలల పిల్లను. అంటే నాన్న మెంటల్ డిజార్డర్ వలన ఆయన కనిపించకుండా పోయారు. కొన్నేళ్ల తర్వాత ఏమయ్యిందంటే వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చేసారు " అంతే. ఇక సిద్దు కూడా తన బాధ చెప్పుకున్నాడు.  "లాస్ట్ ఇయర్ మా ఇద్దరికీ ఒక చిన్న డిఫరెన్స్ వచ్చింది.

అంటే ఒక చిన్న డిస్టెన్స్ . అది చాలా టార్చెర్ గా ఉండేది. నా జీవితంలో చాలా లోయెస్ట్ ఫేజ్ అని చెప్పొచ్చు." అన్నాడు. ఇక సోనియా "నేను సిద్దు మీద చాలా డిపెండ్ ఐపోయాను ఎలా అంటే అతను లేకుండా తినలేను నిద్రపోలేను. అర్ధం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఆ ఫేజ్ లో . ప్యాచ్ అప్ అవడానికి కూడా ఎవ్వడు. నా జీవితానికి అతనే రాజా. ఇప్పుడు నా పక్కన నా మనిషి ఉన్నాడు అందుకే ఏ టెన్షన్ లేదు " అంటూ తన బాధ చెప్పుకుంది సోనియా.  "మీరిద్దరూ ఒకరికి ఒకరు ప్రొపోజ్ చేసుకుంటే చూడాలని ఉంది " అని అడిగింది తేజు.

వెంటనే ఇద్దరూ గోల్డెన్ రోజెస్ తీసుకున్నారు. సిద్దు సోనియా ఒళ్ళో పడుకున్నాడు. "ఇది పార్క్ లా ఫీలవ్వచ్చు " అని తేజు అనేసరికి "ఇంకా నయం ఓయో రూమ్ అనలేదు " అన్నాడు కామెడీగా. గోల్డెన్ రోజే ఇచ్చి "నువ్వు లేకపోతే నేను ఉండలేను" అంటూ ముద్దు పెట్టుకున్నాడు సిద్దు. ఇక సోనియా ఐతే "నేను ఎన్ని జన్మలెత్తినా అన్ని జన్మల్లోనూ నువ్వే నాకు పార్టనర్ గా రావాలి" అని కోరుకుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com