Home

»

Tv News

విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ పేజీని బ్లాక్ చేయండి...సభ్యసమాజానికి ఎం సందేశం ఇస్తోంది...

Apr 12, 2026

బుల్లితెర మీద హల్‌చల్ చేస్తున్న విష్ణు ప్రియ భీమినేనిపై ఏఐఎస్ఎఫ్ నాయకులు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె  ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని బ్లాక్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అర్ధనగ్న వీడియోస్‌ని పోస్ట్ చేసి జస్ట్ 399కే సబ్‌స్క్రయిబ్ చేసుకోండి అంటూ పబ్లిసిటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆమె మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏసిపి భానుకి ఫిర్యాదును అందించారు ఏఐఎస్ఎఫ్ నాయకులు దీపక్, సిద్దు, మనోజ్. సెలెబ్రిటీస్ అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ తప్పుదోవ పట్టించేలా ఉండకూడదు అన్నారు. కాసులకు కక్కుర్తి పడి విష్ణుప్రియ ఈ విధంగా అర్థనగ్న వీడియోలను పోస్ట్ చేసి సభ్యసమాజానికి ఏమి సందేశం ఇస్తున్నట్లు అని ప్రశ్నించారు. విష్ణుప్రియ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా హైపర్‌గా ఉంటూ ఆడియన్స్‌ని  ఎంటర్‌టైన్ చేస్తోంది. పోవే పోరా షోతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సర్కార్ సీజన్‌కి సుధీర్‌తో కో - హోస్ట్ గా చేస్తోంది. ఆమె జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో అన్నీ ఈ అర్ధనగ్న వీడియోస్ , పిక్స్ బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటికి తోడు కింద అసభ్యకరమైన కామెంట్స్ కూడా. ఇప్పుడు విషు ప్రియ మీద కేసు విషయం సోషల్ మీడియాలో బాగా రచ్చ లేపుతోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com