Home

»

Tv News

తిని పడుకునే జాను - భానుని ఎలా గోల్డెన్ కపుల్ గా సెలెక్ట్ చేస్తారు ?

Apr 12, 2026

మ్యాడ్ ఫార్ ఈచ్ అదర్ లేటెస్ట్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ మధ్య టఫ్  ఫైట్ జరిగింది. ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగింది. ఇందులో నటరాజ్ మాష్టర్ - నీతూ జడ్జెస్ మీద ఫుల్ ఫైర్ అయ్యారు. లీస్ట్ జోడీస్ గా నటరాజ్ మాష్టర్ నీతూ, అంజలి - పవన్, నూకరాజు - ఆసియా వచ్చారు. అందులో నూకరాజు - ఆసియా సేఫ్ అయ్యారు. ఇక మిగతా రెండు జోడీస్ లో ఎవరిని ఎలిమినేట్  చేయాలి అనే పాయింట్ కి వచ్చినప్పుడు జడ్జెస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఐతే ఆ టాస్క్ చేయలేము అంటూ నీతూ - నటరాజ్ మాష్టర్ చెప్పారు. "మనుషులు వేరే ఇక్కడ వాళ్ళు బిహేవ్ చేసే విధానం వేరే . నా మైండ్ సెట్ కి ఈ ఆటలు సెట్ కావు. జాను - భాను ఉదయం లేస్తే చాలు ఓట్స్ తింటారు వెళ్లి పడుకుంటారు. వచ్చి బయట మాట్లాడుకుంటారు సోఫాలో అక్కడక్కడా పడుకుంటారు. మిగతా ఏ జంటలకు ఈ జాను - భాను జంటతో అసలు బాండింగ్ లేదు. గేమ్ లో ఓడిపోతే మొత్తానికి ఎలిమినేషన్ రౌండ్ కి వచ్చేస్తున్నాం మ్యాన్షన్ లో ఆడినవి ఏవీ కనిపించడం లేదు. " అంటూ చెప్పారు. ఇక ఈ ఎపిసోడ్ జాను - భాను గోల్డెన్ కపుల్ అయ్యారు. తర్వాత శ్రీముఖి - అనిల్ రావిపూడి కలిసి " అసలు మీ ప్రాబ్లమ్ జాను - భానుతో కదా. వాళ్ళు జస్ట్ తింటున్నారు పడుకుంటున్నారు వెళ్లి నిద్రపోతున్నారు అని అనుకునే వాళ్ళు ఎవరైనా చేతులెత్తండి " అన్నారు. "వాళ్ళెవరూ జాను -భాను గురించి చెప్పరు . ఎందుకంటే మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి. ఐనా మేము ఎన్ని ఆడినా గోల్డెన్ కపుల్ కాము. పేగులు తీసి వీణ వాయించినా అది జరగదు. మేము షో నుంచి క్విట్ ఐపోవాలి అనుకుంటున్నాం " అని నటరాజ్ మాష్టర్ - నీతూ చెప్పారు.  "అలా కాదు నేను మీ మంచి కోసమే చెప్పాము. ఇన్నాళ్లు మార్క్స్ , క్రెడిట్ స్కోర్ ఇచ్చినప్పుడు ఎం మాట్లాడలేదు " అంటూ జడ్జెస్ చెప్పేసరికి చివరికి టాస్క్ ఆడారు. కానీ నటరాజ్ మాష్టర్ - నీతూ ఓడిపోయారు. ఐతే ఫైనల్ గా ఒక ఇంటరెస్టింగ్ ట్విస్ట్ రివీల్ చేసి ఈ వారం నో - ఎలిమినేషన్ అనేసరికి నటరాజ్ మాష్టర్ - నీతూ, అంజలి - పవన్ సేవ్ అయ్యారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com