Home

»

Tv News

ప్రమీల-కార్తీక్‌లను దగ్గర చేసే పనిలో గంగ.. సుధతో ఎమోషనల్ బాండింగ్!

Apr 12, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -241 లో..... గంగ,  రంగా ఇద్దరు కార్తీక్, ప్రమీలని దగ్గర చెయ్యడానికి సూపర్ మార్కెట్ కి వస్తారు. మక్కమ్ దగ్గరికి ప్రమీల వచ్చి కార్తీక్ గారు వచ్చారా అని అడుగుతుంది. దాంతో రంగా, గంగ నువ్వుకుంటారు. ఇంకా రాలేదని మక్కమ్ చెప్పగానే ఇంకా రాలేదా అని ప్రమీల కోప్పడుతుంది. అక్కకి కోపం కూడా ఉందన్న మాట అని గంగ అంటుంది. ఆ తర్వాత గంగ సూపర్ మార్కెట్ లో కావలసిన సరుకులు తీసుకుంటుంది. అదే సూపర్ మార్కెట్ కి సుధా వస్తుంది.

ఇద్దరు అనుకోకుండా ఒకరికొకరు చూసుకొని మాట్లాడుకుంటారు. ఈ సూపర్ మార్కెట్ మాదే అమ్మ.. మా అక్క చూసుకుంటుందని గంగ అనగానే మీరెంత మంది అని సుధ అడుగుతుంది. నేను ఒక్కదాన్నే తను మా తోటికోడలు అని గంగ అనగానే.. తోటి కోడలిని అంత ప్రేమగా అక్క అని పిలుస్తున్నావంటే.. నువ్వు బంధాలకి ఎంత విలువ ఇస్తావో అర్ధం అవుతుందని సుధా అంటుంది. మరొకవైపు సూపర్ మార్కెట్ కి కార్తీక్ వస్తాడు‌. ఎందుకు ఇంత లేట్ అయిందని మక్కమ్ అడుగుతాడు. కొత్త షర్ట్ వేసుకున్న  గుడికి వెళ్ళానని కార్తీక్ అనగానే కొత్త షర్ట్ వేసుకుంటే గుడికి వెళ్తారా అని మక్కమ్ అంటాడు. అంటే బర్త్ డే అయితే వెళ్తారు కదా అని కార్తీక్ అనగానే అంటే ఈ రోజు మీ పుట్టినరోజా అని మక్కమ్ అంటాడు. అవునని కార్తీక్ అంటాడు. మరి సెలెబ్రేషన్స్ అని మక్కమ్ అనగానే నాకెవరున్నారు సర్ సెలబ్రేట్ చెయ్యడానికి అని కార్తీక్ అంటాడు.

ఆ మాటలు అక్కడే ఉన్న రంగా వింటాడు. తెలియకుండా సెలెబ్రేషన్స్ చెయ్యాలని గంగ, రంగా ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత గంగ తనకి ఇష్టమైన చాక్లెట్ తీసుకుంటుంటే సుధా కూడా తీసుకుంటుంది. ఇది నాకు ఇష్టమైన చాక్లెట్ అనగానే నా కూతురికి కూడా ఇష్టమైన చాక్లెట్ అని సుధా అనుకుంటుంది. గంగ చాక్లెట్ సుధాకి తినిపిస్తుంది. ఆ తర్వాత గంగ సూపర్ మార్కెట్ లో వచ్చిన తర్వాత స్టాక్ అంతా పెద్దసారుకి వీడియో కాల్ లో చూపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com