Podharillu : చక్రిని వెళ్ళిపోమన్న మహా.. నారాయణ ఇంట్లోవాళ్ళు వెయిటింగ్!
on Jan 27, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -36 లో...... మహా చేసిన పనికి వాళ్ళ నాన్న సూసైడ్ అటెంప్ట్ చేసాడని మహాకి తెలిసి వెంటనే తనని చూడాలని అంటుంది. చక్రి తనని తీసుకొని బయల్దేరతాడు. అలా మహాని తీసుకొని వెళ్లిపోతుంటే.. ఊళ్ళో అందరు ఇల్లు , ఇంట్లో వాళ్ళని చూసి బయపడి వెళ్తుందని అనుకుంటాడు. అలానే అంటూ నారాయణ వాళ్ళ అన్న నారాయణతో వెటకారంగా మాట్లాడతాడు. మరొకవైపు ఇదంతా మీ వల్లే అని చక్రితో మహా అంటుంది. అప్పుడే కానిస్టేబుల్ ఫోన్ చేస్తాడు.
మీరు స్టేషన్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు కదా.. లీగల్ గా సర్టిఫికెట్ వచ్చింది.. వెంటనే వచ్చి ఇద్దరు సంతకాలు పెట్టి సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళండి అని చెప్తాడు. ఇప్పుడు గనుక ఈ విషయం చెప్తే ఇంకేమైనా ఉందా అని చక్రి భయపడుతాడు. మరొకవైపు నారాయణ ఇంటికి వెళ్తుంటే తాయారు ఎదరుపడి.. నీ కోడలు వెళ్ళిపోయిందట కదా అయినా నీ ఇంట్లో ఏ ఆడపిల్ల ఉంటుందని నారాయణని తక్కువ చేసి మాట్లాడుతుంది. నీ భర్త దుబాయ్ లో వేరొక దానితో ఉంటున్నాడట.. ముందు అది చూడు అని నారాయణ అంటాడు. ఆ తర్వాత మహా, చక్రి ఇద్దరు ప్రతాప్ ఇంటికి వెళ్తారు. అక్కడ ఆది వాళ్ళని చూసి ఎందుకు వచ్చారని మహాపై గట్టిగా అరుస్తాడు. చక్రిని కొట్టబోతాడు. మహా, చక్రి వెళ్లిపోతుంటే భూషణ్ వస్తాడు. మళ్ళీ మహా, భూషణ్ కి మధ్య గొడవ జరుగుతుంది. మరొకవైపు కన్నా వాళ్ళ కాలేజీలో తన ఫ్రెండ్ ఒకడు.. మీ వదిన వెళ్ళిపోయిందట కదా అని అంటాడు. దాంతో వాళ్ళతో కన్నా గొడవపడతాడు.
ఆ తర్వాత మహా, చక్రి హాస్పిటల్ కి వెళ్తారు. ప్రతాప్ ని దూరం నుండి చూస్తూ మహా ఏడుస్తుంది. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి ఎందుకు వచ్చావే.. ఎలా పెంచామే నిన్ను అని కోప్పడుతుంది. నువ్వు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకు అని మహాని వాళ్ళ అమ్మ అంటుంది. దాంతో హారిక, మహాని పక్కకు తీసుకొని వెళ్లి.. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని అంటుంది. వదిన నేను ఏ తప్పు చెయ్యలేదు. అంతా తర్వాత చెప్తానని మహా అంటుంది. నిన్ను నేను తక్కువ అంచనా వేసానని చక్రితో హారిక అంటుంది. తరువాయి భాగంలో వదిన ఇంట్లోనే ఉందని అందరికి తెలిసేలా రిసెప్షన్ చెయ్యాలని నారాయణ, మాధవ అనుకుంటారు. మరొకవైపు ఇక మీతో వచ్చే అవసరం లేదు.. ఇక వెళ్లిపోండి అని చక్రితో మహా అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



