నాకు లైఫ్ ఇచ్చింది రాకెట్ రాఘవ...ఆర్టిస్ట్ గా గుర్తింపు ఇచ్చింది జబర్దస్త్
on Jul 28, 2025

జబర్దస్త్ ఒక కామెడీ షో మాత్రమే కాకుండా ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. రైటర్స్ , ఆర్టిస్టులకు మంచి అవకాశం వచ్చింది. ఆ జబర్దస్త్ కారణంగానే సుధీర్, గెటప్ శీను, బులెట్ భాస్కర్, ఇమ్మానుయేల్, రాకింగ్ రాకేష్ ఇలాంటి వాళ్లంతా కూడా ఈ షో ద్వారా బాగా ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఇక బులెట్ భాస్కర్ మొదట్లో రైటర్ గా స్టార్ట్ అయ్యి తర్వాత ఆర్టిస్ట్ అయ్యాడు. ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యాడు. అలా తన ఎక్స్పీరియన్స్ ని తన జబర్దస్త్ జర్నీని తన మాటల్లోనే..."రాకెట్ రాఘవ గారిని నేను జీవితంలో మరిచిపోలేని వ్యక్తి. జబర్దస్త్ 2013 ఆగష్టులో అలా స్టార్ట్ అయ్యింది. నాకు అప్పటికి ఏమీ తెలీదు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం రాఘవ గారు. ఆయన ఆ మాట ఒప్పుకోరు గాని నేను ఒప్పుకోవాలి.
మనం లైఫ్ లో ఎవరినైనా మర్చిపోవచ్చు కానీ మనకు సాయం చేసిన వాళ్ళను మర్చిపోకూడదు. నాకు కొంచెం రైటింగ్ నాలెడ్జ్ ఉందని చేపి రాఘవ గారు నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక రైటర్ గా ఒక ఆర్టిస్ట్ గా ఫస్ట్ ఆయన స్కిట్ లోనే చేసాను. చేసింది 2 , 3 స్కిట్స్ ఐనా కానీ అసలు గుర్తింపు అంటూ లేని నాకు మంచి గుర్తింపును తెచ్చాయి. ఆ తర్వాత చంటి గారి టీమ్ లోకి వెళ్లాను. ఆయన దగ్గర కూడా స్కిట్స్ రాసాను. ఒక రైటర్ గా, ఒక ఆర్టిస్ట్ గా కూడా అక్కడ నాకు మంచి పేరు వచ్చింది. 2016 జనవరిలో నేను టీమ్ లీడర్ ని అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్ లీడర్ గా కంటిన్యూ అవుతూనే ఉన్నాను." అంటూ చెప్పుకొచ్చాడు బులెట్ భాస్కర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



