
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -994 లో......వెంకీ లవ్ కి హెల్ప్ చేస్తానని నందు మాటిస్తుంది. దాంతో వెంకీ లవర్ తనని నిజంగానే లవ్ చేస్తుందో లేదో టెస్ట్ చెయ్యడానికి రెస్టారెంట్ లో వెంకీని తన లవర్ రోజాతో కలవమని చెప్తుంది. వెంకీ, రోజా ఒక టేబుల్ పై కూర్చొని ఉంటారు. దూరంగా మరొక టేబుల్ మీద నందు కూర్చొని వెంకీకీ బ్లూ టూత్ ద్వారా ఏం మాట్లాడాలో చెప్తుంది.
మొదట నందు చెప్పినట్లు వెంకీ మాట్లాడతాడు. దాంతో రోజా ఇంప్రెస్ అవుతుంది. ఆ తర్వాత నందు తన ముందు టేబుల్ పై ఒక దొంగ కన్పిస్తాడు. తనని పట్టుకోవడానికి నందు అతని వెంట పరుగెడుతుంది. వెంకీకీ రోజాతో ఏం మాట్లాడాలో అర్థం కాదు.. వెంకీ ఏదో మాట్లాడుతుంటే రోజా చిరాకుగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు ఇందు వెళ్తుంటే రాజు, లక్కీ తనకి డాష్ ఇస్తారు. దాంతో తన కూరగాయలన్నీ కిందపడిపోతాయ్. ఎప్పటిలాగా రాజు, ఇందులకి గొడవ అవుతుంది. కూరగాయలన్నీ తీసి లక్కీ ఇస్తాడు. నాకు కిందపడ్డ కూరగాయలు వద్దని ఇందు గొడవ చేస్తుంది. దాంతో లక్కీ తనని కూల్ చేసి ఫ్రెష్ కూరగాయలు నేను ఇప్పిస్తానంటూ అన్ని కూరగాయలు కొనిస్తాడు.
మరొకవైపు నందు దొంగ వెంట పరుగెడుతుంది. నేను దొరికిన పర్వాలేదు గానీ ఈ బ్యాగ్ అన్నకి చేరాలని రౌడీ అనుకొని అటుగా వస్తున్న రాజు, లక్కీ లని రిక్వెస్ట్ చేస్తాడు. కొంచెం ఈ బ్యాగ్ ముందు ఒక అన్నకి ఇవ్వాలని చెప్తాడు. ఆ అన్నకి ఇస్తే మీకు పదివేలు ఇస్తానని రౌడీ అనగానే సరేనని రాజు, లక్కీ కక్కుర్తిపడి బ్యాగ్ పట్టుకొని వెళ్తారు. అందులో మత్తుకి సంబంధించిన ప్యాకెట్స్ ఉంటాయి. రౌడీ దగ్గరికి పోలీసులని తీసుకొని వస్తుంది నందు. రాజు, లక్కీ ఇద్దరు బ్యాగ్ తో వెళ్తుంటే పోలీసులు చూసి వాళ్ళని ఫాలో అవుతుంటే రాజు, లక్కీకి డౌట్ వచ్చి వాళ్ళకి దొరకకుండా వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






