Home

»

Tv News

Illu illalu pillalu: రికార్డింగ్ డిలీట్ చేసిన శ్రీవల్లి.. నర్మద, ప్రేమలకు దిమ్మతిరిగే షాక్!

Apr 02, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -434 లో..ధీరజ్ కాఫీ తాగుతూ కాఫీ ఎవరు చేసారో గాని చాలా బాగా చేశారని ధీరజ్ అంటాడు. ఇంకెవరు ప్రేమ చేసిందని వేదవతి అనగానే కాఫీ పక్కన పెట్టి బాలేదని అంటాడు. భార్యాభర్తల మధ్య గొడవ నాలుగు గోడల మధ్యలో ఉండాలి గానీ ఇలా నలుగురిలో ఉండొద్దురా అని ధీరజ్ తో వేదవతి అంటుంది. అక్కడే ప్రేమ కూడా ఉంటుంది. అప్పుడే ధీరజ్ కి కంట్లో నలుసు పడుతుంది. అమ్మ త్వరగా రా అని ధీరజ్ పిలుస్తాడు.

అబ్బా మంచి ఛాన్స్ నువ్వు వెళ్ళు అని ప్రేమని ధీరజ్ దగ్గరికి పంపిస్తుంది వేదవతి. ధీరజ్ కళ్ళలో ప్రేమ నలుసు పోగొడుతుంది. మనసులో కూడా అంతేరా ఏదైనా చెడుగా ఉంటే తీసేయ్యాలి అప్పుడే బాగుంటుందని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ప్రేమ, నర్మద కలిసి రోజులాగే శ్రీవల్లితో ఒక అట ఆడేసుకోవడానికి పక్కకి తీసుకొని వస్తారు. నువ్వు రాత్రంతా నిద్రపోవద్దు.. ఒకవేళపోతే మర్యాదగా ఉండదని ఇద్దరి మధ్య వల్లిని కూర్చొబెట్టుకొని రాత్రంతా పడుకోకుండా కాపలా ఉంటారు. కొద్దిసేపటికి ప్రేమ, నర్మద నిద్రలోకి జారుకుంటారు. అప్పుడే ప్రేమ ఫోన్ నుండి వల్లి వాళ్ళ అమ్మతో మాట్లాడిన వాయిస్ రికార్డు డిలీట్ చేస్తుంది శ్రీవల్లి.

ఆ తర్వాత ఇంట్లో అందరు శ్రీరామనవమి సెలెబ్రేషన్స్ లో బిజీగా ఉంటారు. ప్రేమ కంగారుగా నర్మద దగ్గరికి వచ్చి అక్క వాయిస్ రికార్డ్ డిలీట్ అయిందని చెప్తుంది. దాంతో నర్మద షాక్ అవుతుంది. అప్పుడే వల్లి వస్తుంది. నువ్వే కదా వాయిస్ రికార్డు డిలీట్ చేసావని ప్రేమ అడుగుతుంది. తెలిసిపోయిందా అని వాళ్ళకి కోపం వచ్చేలా మాట్లాడుతుంది శ్రీవల్లి. ఆ తర్వాత నర్మద, ప్రేమ దగ్గరికి చందు వస్తాడు. మీకు వల్లి చదువు గురించి ఎందుకు డౌట్ వచ్చిందని అడుగుతాడు. అంతకన్నా పెద్ద మ్యాటర్ తెలియాలి.. అసలు విశ్వకి, అమూల్యకి మధ్య ఎవరి వళ్ళ లవ్ మొదలు అయిందో వల్లి అక్కకి తెలుసనిని నర్మద అనగానే అవునా వెంటనే వల్లిని ఆడుగుతానంటూ చందు వెళ్తాడు. వల్లి తన నోటితో తనే చెప్పాలనే ఈ ప్లాన్ అని ప్రేమతో నర్మద అంటుంది. తరువాయి భాగంలో   చందు వెళ్లి వల్లిని అడుగుతాడు. అమూల్యతో విశ్వని లవ్ చేయమని చెప్పింది ప్రేమ అని చెప్పగానే చందు షాక్ అవుతాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com