Home

»

Tv News

Podharillu : హారికకు షాక్ ఇచ్చిన మహా.. నారాయణ కోసం వైన్స్ షాపుకు వెళ్లిన కోడలు!

Apr 01, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -82 లో.....నారాయణని మహా హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. జరిగిందంతా చెప్పాడని చక్రికి ఫోన్ చేస్తుంది. అన్నయ్య కాలేజీకి వచ్చాడు.. ఇలా గొడవ జరిగింది.. అన్నయ్య కత్తితో పొడిచాడని చెప్పగానే చక్రి షాక్ అవుతాడు. ఏ హాస్పిటల్ నేను వస్తానని చక్రి అడుగుతాడు. వద్దు పర్వాలేదు నేను అంతా చూసుకుంటానని మహా చెప్తుంది. ఆ తర్వాత నారాయణ స్పృహలోకి వస్తాడు. డాక్టర్ చెకప్ చేసి డిశ్చార్జ్ చేస్తాడు.

నారాయణని మహా పట్టుకొని నడిపించాలని ట్రై చేస్తుంటే అవసరం లేదమ్మ స్ట్రాంగ్ బాడీ ఇక్కడ అని తనే నడుస్తాడు. ఆ తర్వాత నారాయణని తీసుకొని మహా ఇంటికి బయలుదేర్తుంది.. నొప్పి అంటూ నారాయణ ఇబ్బంది పడుతాడు. మందు ఉంటే బాగుండు అని డ్రైవర్ తో నారాయణ అనడం మహా వింటుంది. ఆ మందు తాగి మత్తుగా పడుకుంటాడని మహా అనుకొని వైన్స్ దగ్గరికి వెళ్లి మందు కొనుక్కొని వస్తుంది. అది నారాయణకి ఇస్తుంది. అది చూసి నారాయణ షాక్ అవుతాడు. నువ్వు వెళ్లి తీసుకొని రావడం ఏంటమ్మా అని నారాయణ అంటాడు. మరి ఇచ్చేసి రానా అని మహా అనగానే వద్దులే అమ్మ అని తీసుకొని తాగి మత్తుగా పడుకుంటాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకుంటారు. జరిగింది తెలిసి ఇంట్లో వాళ్లంతా మహా వాళ్ళ అన్నయ్యపై కోపంగా ఉంటారు.

అసలు వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి ఇంకొకసారి మీ జోలికి రాకుండా చూస్తామని కేశవ వాళ్ళు అంటుంటే వద్దు వదిలెయ్యండి అని మహా అంటుంది. నారాయణకి దగ్గర ఉండి టాబ్లెట్స్ ఇస్తుంది మహా. ఆ తర్వాత రాత్రి మహాకి హారిక ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఏదో గొడవ జరిగిందంట అని అడుగుతుంది. గొడవ కాదు మీ ఆయన చక్రి వాళ్ళ నాన్నని కత్తితో పొడిచాడని అనగానే హారిక షాక్ అవుతుంది. ఇప్పుడు బాగున్నాడు తను కేసు పెడితే మీ ఆయన ఎక్కడ ఉంటాడు.. ఇంకొకసారి మా జోలికి రాకండి అని మహా కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com