.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1180 లో...... ఇందు పెళ్లి ఆపాలంటే రాజు మాత్రమే రావాలని అపర్ణ ఫోన్ చేస్తుంది. రాజు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అపర్ణ టెన్షన్ పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయగలం అండి అంటూ సుభాష్ తో చెప్పుకుంటూ బాధపడుతుంది. ఆ రేఖను ఎదిరించే ధైర్యం మనకు లేదని అందుకు రాజు మాత్రమే రావాలని సుభాష్ అంటాడు. రేఖకు తోడు భ్రమరాంబ తోడైందని, ఉన్నవి లేనివి కల్పించి మరింత రెచ్చగొడుతుందని అంటుంది. ఇద్దరూ కలిసి ఇంటిని పెంటపెంట చేస్తున్నారంటూ తను చలపతి ఇంటికి వెళ్లి మాట్లాడి వస్తానని అపర్ణ అంటే, చలపతి మొన్న మాట్లాడింది విన్నావు కదా.. ఇప్పుడు వెళితే ఇంకెంత మాట్లాడతాడోనని సుభాష్ అంటాడు. ఆ చలపతిని దేవుడే మార్చాలని, రాజు ఇంటికి వచ్చేలా చేయాలని ఇందు రూంలోకి అపర్ణ వెళ్తుంది. ఏ ధైర్యంతో ఈ నిర్ణయం తీసుకున్నావని అడిగితే తన ప్రేమ మీద నమ్మకం ఉందని, రాజు తప్పకుండా వస్తాడని, బాధపడొద్దంటూ ఇందు ధైర్యం ఇస్తుంది.
పెళ్లికొడుకు తల్లిదండ్రులతో కలిసి దుగ్గిరాల ఇంటికి వస్తాడు. వారికి ఎదురుగా వెళ్లిన నందు వెటకారంగా మాట్లాడుతుంది. పెళ్లికొడుకును ఒక రూంలోకి తీసుకెళ్లి ఇదే మీ రూం బావగారు అంటూ జ్యూస్ ఇస్తుంది. జ్యూస్ లో మోషన్ టాబ్లెట్ కలిపావు కదా అంటూ ఇంకో జ్యూస్ తీసుకుని తాగుతాడు పెళ్లికొడుకు. తనకు తెలివి ఎక్కువని బిల్డప్ ఇస్తూనే కడుపులో గుసగుసలు రావడంతో బాత్రూంలోకి పరుగెత్తుతాడు. నందు నవ్వుకుంటూ వెళ్లిపోతుంది.
చలపతి ఇంట్లో లక్ష్మీ అందరిని తిడుతుంది. అక్కడ ఇందు పెళ్లి జరుగుతుంటే ఇక్కడ తీరిగ్గా కూర్చుని భోజనం చేస్తున్నారని అంటుంది. కూరల్లో ఉప్పు, కారం ఎక్కువ వేశావేంటని చలపతి అడిగితే కొందరికి అవి తింటేనైనా రోషం, పౌరుషం వస్తాయని రాజును చూస్తూ తిడుతుంది. రాజు వచ్చి తనకు వడ్డించమని భోజనం చేస్తుంటాడు. లక్ష్మీ కోపంగా బయటకు వెళ్తుంది.
దుగ్గిరాల ఇంట్లో పెళ్లి జరుగుతుండగా భ్రమరాంబ నీ ప్లాన్ సక్సెస్ అయిందని రేఖను మెచ్చుకుంటుంది. శేషు మాత్రం చివరి నిమిషంలో రాజు వచ్చి పెళ్లి ఆపేస్తాడనిపిస్తుంది. ఇందు ముఖం చూస్తేనే అర్థమవుతుందని అంటాడు. ఈ సారి నీ ప్రిడిక్షన్ తప్పు అవుతుంది అన్నయ్య అని రేఖ అంటుండగానే పెళ్లికొడుకు ఇంకా మండపంలోకి రాలేదని పంతులు పిలుస్తాడు. రేఖ, భ్రమరాంబ టెన్షన్ పడతారు. పెళ్లికొడుకు బాత్రూంలో కుస్తీలు పడుతుంటాడని నందు మనసులో నవ్వుకుంటుంది. అప్పుడే పెళ్లికొడుకు రావడంతో నందు షాక్ అవుతుంది.పెళ్లికొడుకు కోపంగా చూస్తూ ఇందు పక్కన పెళ్లిపీటల మీద కూర్చుంటాడు.
అది చూడలేక అపర్ణ బయటకు వెళ్లి రాజుకు ఫోన్ చేస్తుంది.రాజు లిఫ్ట్ చేయకపోవడంతో లక్ష్మీ వెళ్లి లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. అపర్ణ బాధపడుతూ ఇందుకు పెళ్లి ఇష్టం లేదని, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుందని, నువ్వు లేకపోతే దాని జీవితమే వ్యర్థమని ఏడుస్తుంది. అంతా వింటున్న రాజు మౌనంగా ఉంటాడు. నువ్వు మాట్లాడకపోయినా సరే ఇందు పెళ్లికూతురు అయిన ఫోటో సెండ్ చేస్తాను.. అప్పుడైనా నీ మనసు మారుతుందేమో చూడు రాజు అంటూ కాల్ కట్ చేసి ఫోటో సెండ్ చేస్తుంది. లక్ష్మీ ఫోటో ఓపెన్ చేసి రాజుకు చూపిస్తుంది. రాజు కోపంగా బయటకు వెళ్లిపోతాడు. వెనకాలే వెళ్లిన లక్ష్మీ రాజును వెంటనే వెళ్లి పెళ్లి ఆపేసి ఇందును పెళ్లి చేసుకుని రమ్మని చెప్తుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
