Home

»

Tv News

సరిగమపలో శర్వానంద్ సందడి.. ఇమ్మానుయేల్‌కు అదిరిపోయే ఆఫర్.. అనంత్ శ్రీరామ్‌కు షాక్

Nov 5, 2026 9:22AM

సరిగమప షో లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్ కి "భోగి " మూవీ హీరో శర్వానంద్ వచ్చాడు. రాగానే "భోగి " మూవీ అన్నాచెల్లెళ్ల కథ అని చెప్పాడు. "భోగి టీమ్ కి నా బెస్ట్ విషెస్. ఎం కెరీర్ లో స్పెషల్ ఫిలిం అవుతుంది " అని చెప్పారు అనిల్ రావిపూడి. "మిమ్మల్ని ఈ కోవలో చూడడం నాకు సంతోషంగా ఉంది " అన్నారు అనంత శ్రీరామ్. వెంటనే శర్వానంద్ కూడా "మిమ్మల్ని కూడా ఈ పాత్రలో చూడం చాలా కొత్తగా ఉంది" అన్నారు. దాంతో అనంత్ ఫుల్ ఖుషీ ఐపోయి సిగ్గుపడిపోయారు.

"మీరు ట్వీట్ చేయడం వలన ఒకతను పెద్ద సింగర్ అయ్యాడు. అది పాడదామనుకుంటున్నా సర్ " అంటూ ఇమ్మానుయేల్ వచ్చి అడిగేసరికి "నువ్వా " అని ఆశ్చర్యపోయారు. తర్వాత ఒక పాట పాడాడు. "మీకు నచ్చితే రేపు ఒక ట్వీట్ వేయండి సర్ " అన్నాడు. దాంతో శర్వానంద్ "రేపు ఆఫీస్ కి వచ్చేసేయ్ అక్కడ మాట్లాడుకుందాం " అన్నాడు. ఇక తర్వాత లేడీ సింగర్స్ వచ్చి "ఒక్కో హీరోని చూస్తే ఒక్కో ఫీలింగ్ వస్తుంది. కానీ మిమ్మల్ని చూస్తే మన హీరోనే కదా " అనిపిస్తుంది అంటూ ఒక మంచి సాంగ్ పాడి వినిపించింది. తర్వాత ఇమ్ము మళ్ళీ ఒక సాంగ్ పాడాడు. "ఏమైపోతానే " అనే సాంగ్ పడేసరికి అందరూ ఖుషీ ఇపోయారు. "ఐనా నీకు ట్వీట్ వేయర్రా " అని చెప్పాడు సుధీర్.

"ప్రతీ ఒక్కళ్ళు పాడేటప్పుడు ఒక్కో బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. శ్రీనిధి పాడేటప్పుడు చెయ్యి ఊపుతూ పాడుతుంది. అలా ఎందుకు అంటుందో నాకు అర్ధమయ్యింది. లిరిక్స్ మర్చిపోకుండా అనంత్ కి దొరికిపోకుండా అరచేతిలో లిరిక్స్ రాసుకుని వస్తోందా " అనేసరికి అందరూ ఫుల్ గా నవ్వేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com