Home

»

Tv News

Karthika Deepam2:మాలినికి కార్తీక్ వార్నింగ్.. సూరజ్ ని విసిగించిన జ్యోత్స్న!

Nov 5, 2026 9:12AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -821 లో....కార్తీక్ మేనేజర్‌ని గెంటేస్తాడు. తను తప్పు చేయలేదని మేనేజర్ బతిమాలినా కార్తీక్ వినడు. పాములు పట్టేవాడు పాము కాటుకే బలైపోతాడని, తాతని అన్యాయంగా గెంటేసినప్పుడు బాధ లేదా అని ప్రశ్నిస్తాడు.బయట నిల్చున్న మాలినితో తోడేలు తప్పు నుంచి తప్పించుకోవడానికి కుందేలును బలి చేసిందని అంటాడు.మాలిని తన ఆట డైనోసార్ వేటలా ఉంటుందని, తట్టుకోలేరని వార్నింగ్ ఇస్తుంది. జ్యోత్స్న సూరజ్‌తో మేనేజర్ తప్పు ప్రూవ్ అయితే దీపనే తప్పు పడుతున్నారని వాదిస్తుంది.

దశరథ్, సుమిత్ర ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎందుకు వంట మనిషిగా చేస్తున్నావని దశరథ్ అడిగితే రెండు గంటల పని, మంచి జీతం అని సుమిత్ర చెప్తుంది. దాచిన డబ్బు కూతురి పెళ్లికి ఉపయోగపడుతుందని, భార్యాభర్తలు అన్నీ చెరి సగం పంచుకోవాలని అంటుంది. పెళ్లి అయిన ఇన్ని నాళ్లకు భార్య కొత్తగా కనిపిస్తుందని దశరథ్ మురిసిపోతాడు. కష్టసుఖాలు కలిసే నడుద్దామని, ఈ విషయం మామయ్యకి చెప్పొద్దని సుమిత్ర అనడంతో ఇద్దరూ సంతోషంగా ఇంటికి వెళ్తారు.

దీప, కార్తీక్, జ్యోత్స్న భోజనానికి కూర్చుంటారు. జ్యోత్స్న బాక్స్ ఓపెన్ చేసి వెళ్లగానే సూరజ్ వచ్చి అది తనది అనుకొని తినేస్తాడు. జ్యోత్స్న వచ్చి కూడా అదే బాక్స్ లో కలిసి తినడంతో ఇద్దరూ పూర్తిగా తినేస్తారు. మాలిని వచ్చి మన బాక్స్ అది కాదు, వాళ్లతో ఎందుకు తింటున్నావని సూరజ్ మీద కోప్పడుతుంది. సూరజ్ జ్యోత్స్నపై ఫైర్ అవుతూ కావాలనే ఇరికించారనంటే, రేపు మీరు బాక్స్ తెండి చెల్లుకు చెల్లు, ముందు సారీ చెప్పండని జ్యోత్స్న విసిగిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com