మినిస్టర్ ప్లాన్ అదే.. పాప ప్రాబ్లమ్ విని కావ్య, రాజ్ షాక్!
on Jan 25, 2026
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -938 లో..... కావ్య తన దగ్గరున్న పాపకి నోటిలో నుండి నురుగ రావడం చూసి భయపడి రాజ్ దగ్గర వచ్చి చెప్తుంది. ఇంట్లో వాళ్ళు అందరు టెన్షన్ పడతారు. దాంతో పాపని వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. అక్కడ కావ్యకి డెలివరి చేసిన అనురాధ డాక్టర్ కాకుండా చక్రవర్తి ఉంటాడు. పాపకి టెస్ట్ లు చెయ్యమని నర్సుకి చెప్తాడు. పాపను నేను ఏం చెయ్యలేదు అండి ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదని రాజ్ తో కావ్య చెప్తుంది. పాప వద్దనుకున్నావ్.. పాప ప్రాణం కాదు.. నువ్వు ఏంటో నాకు తెలుసు కదా ఏం టెన్షన్ పడకని కావ్యతో రాజ్ అంటాడు.
ఆ తర్వాత పాప రిపోర్ట్స్ వస్తాయి. అవి చూసి డాక్టర్ చక్రవర్తి షాక్ అవుతాడు. మినిస్టర్ డాక్టర్ తో పాపని మార్చమని చెప్పినప్పుడు డాక్టర్ వద్దని చెప్పింది.. గుర్తు చేసుకుంటాడు. అంటే చక్రవర్తి గారు పాపని మార్చేశారన్న మాట.... ఆయన సంగతి చెప్తానని డాక్టర్ బయటకి వెళ్తుంటే.. పాపకి ఏమైంది డాక్టర్ అని అడుగుతాడు. రిపోర్ట్స్ రాలేదు వచ్చాక చెప్తాను. నేను బయటకి వెళ్తున్నానని డాక్టర్ వెళ్తాడు. మరొకవైపు మినిస్టర్ దగ్గరికి రుద్రాణి వస్తుంది. తనకి తులసి కాఫీ ఇస్తుంది. మీరు మాకు ఏదో హెల్ప్ చేశారని చెప్పారు. ఏంటో చెప్పడం లేదని తులసి అనగానే నీ డెలివరీ టైమ్ కి మీ అయన కోర్ట్ కి వెళ్ళాలి.. అలా వెళ్లకుండా నేను హెల్ప్ చేసాను.. మీ భర్తకి మీరంటే చాలా ఇష్టం కదా డెలివరీ టైమ్ లో మీ దగ్గర ఉండాలి కదా అని రుద్రాణి చెప్తుంది. అప్పుడే డాక్టర్ వస్తాడు. డాక్టర్ చక్రవర్తి రావడం మినిస్టర్ గమనించి తులసి నువ్వు లోపలికి వెళ్లి పాపకి పాలు పట్టమని చెప్తాడు. రుద్రాణి కూడా అక్కడే ఉంటుంది. డాక్టర్ వచ్చి ఎందుకు ఇలా చేశారు. పాపని మార్చొద్దన్నాను కదా అని డాక్టర్ అనగానే మినిస్టర్ ఈ విషయం గురించి డిస్కషన్ వద్దని అంటాడు. ఈ విషయం తన పేరెంట్స్ కి చెప్తానని డాక్టర్ వెళ్తుంటే రౌడీలతో డాక్టర్ ని కొట్టిస్తాడు.. ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేవరకు నువ్వు నా దగ్గర ఉండాలని మినిస్టర్ అంటాడు. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కానీ రాబోయే ప్రాబ్లెమ్ ఎలా సాల్వ్ చేస్తారని రుద్రాణి అంటుంది. వెంటనే మినిస్టర్ పాపని మార్చిన నర్సుకి ఫోన్ చేసి డాక్టర్ చక్రవర్తి ఇక రాడు.. నేను చెప్పినట్లు చెయ్యకపోతే నీ పరిస్థితి కూడా అంతే అని తనకి ఏదో చెప్పి అలా చెయ్యమని చెప్తాడు.
ఆ తర్వాత డాక్టర్ అనురాధ వస్తుంది. తనకి నర్సు రిపోర్ట్స్ ఇస్తుంది. రాజ్, కావ్య డాక్టర్ దగ్గరికి వస్తారు. పాప పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు ఇలా అయిందని పాపకి ఉన్న అనారోగ్య సమస్య గురించి డాక్టర్ చెప్పగానే రాజ్, కావ్య ఇద్దరు షాక్ అవుతారు. ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ లేదా అని రాజ్ అడుగగా ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తుంది. తరువాయి భాగంలో పాపని స్వప్నకి ఇచ్చి డాక్టర్ దగ్గరికి వస్తుంది కావ్య. నా పాప గురించి తెలుసుకోవడానికి సహాయం చెయ్యండి అని డాక్టర్ ని కావ్య రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



