
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -223 లో... ప్రమీల అర్థరాత్రి అయినా సూపర్ మార్కెట్ నుండి ఇంకా ఇంటికి రాలేదని ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతారు. ప్రమీల కార్ ట్రబుల్ ఇచ్చి మధ్యలో ఆగిపోతుంది. దాంతో తప్పనిసరి పరిస్థితిలో వస్తున్న బైక్ ని లిఫ్ట్ అడుగుతుంది. తీరా చూస్తే అతను తనకి గుడిలో పరిచయం అయిన కార్తీక్. తనని చూడగానే కోపంగా పక్కకి తిరుగుతుంది ప్రమీల. లిఫ్ట్ ఇస్తాను రండీ అని కార్తీక్ అంటాడు. దాంతో వేరొక మార్గం లేక అతని బైక్ ఎక్కుతుంది.
మరొకవైపు శకుంతల దగ్గరికి వీరు వచ్చి.. అత్తయ్య మన మనుషులతో అంతా వెతికిస్తున్నానని అంటాడు. ఒకవైపు రుద్ర, మరొకవైపు వంశీ వెతుకుతారు. వంశీకి ఒక దగ్గర కార్ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ కార్ డ్రైవర్ ఇంకా ప్రమీల లేకపోయేసరికి వంశీకి టెన్షన్ అవుతుంది.
మరొకవైపు ప్రమీల ఇంకా రాకపోయేసరికి శకుంతలకి.. వద్దంటే వినకుండా వెళ్ళిందనే కోపం ఒకవైపు, ఇంకా రాలేదన్న భయం మరొకవైపు ఉంటుంది. ఆ తర్వాత గంగ ఏదో మాట్లాడబోతుంటే.. నువ్వు మాట్లాడకు మొగుడు పెళ్ళాలు కలిసి ఇదంతా చేశారని శకుంతల కోప్పడుతుంది. అప్పుడే ప్రమీల బైక్ దిగడం చూసి అందరు షాక్ అవుతారు. లిఫ్ట్ ఇచ్చాను ఇంట్లోకి పిలిచి టీ కాఫీ ఇవ్వొచ్చు కదా అని కార్తీక్ అంటాడు. ప్రమీల కోపంగా చూసేసరికి కార్తీక్ జోక్ గా అన్నానని వెళ్ళిపోతాడు.
ప్రమీల ఇంట్లోకి రాగానే శకుంతల తన మాటల్తో హింసపెడుతుంది. కార్తీక్ గురించి ప్రమీల చెప్తుందా.. రుద్ర ఏం చేయనున్నాడు. శకుంతల అన్ని తిట్టాక కూడా ప్రమీల సూపర్ మార్కెట్ కి వెళ్తుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





