Brahmamudi: నిజం చెప్పేసిన కావ్య.. రుద్రాణి ప్లాన్ అదే!
on Feb 8, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -950 లో... ధాన్యలక్ష్మికి రుద్రాణి కాల్ చేస్తుంది. నాకెందుకు కాల్ చేసావని ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అంటుంది. నాకేం అవసరం లేదని ధాన్యలక్ష్మి అంటుంది. నీకు రాబోయే వారసుడికి ప్రమాదం అంటే కూడా వినవా.... రాజ్, కావ్య ఆ మినిస్టర్ తో గొడవపడ్డారు కాబట్టే అతను అందరిపై అలా చేసాడు. రాజ్, కావ్య స్వార్ధానికి వాడితో గొడవ పెట్టుకున్నారు. అలా చేస్తే మినిస్టర్ ఏం చెయ్యడానికి అయినా వెనుకాడడు అని రుద్రాణి అనగానే ధాన్యలక్ష్మి అదంతా నమ్మేస్తుంది.
మరుసటిరోజు రాజ్, కావ్య పాపని తీసుకొని హాస్పిటల్ కి బయల్దేరతారు. పాపకు ఈ రోజు ఆపరేషన్ నాకు భయంగా ఉందని కావ్య అంటుంది. అప్పుడే ధాన్యలక్ష్మి ఎంట్రీ ఇస్తుంది. మీరు ఆ మినిస్టర్ తో ఎందుకు గొడవ పడ్డారని అడుగుతుంది. బిజినెస్ గురించి అని కావ్య అనగానే అబద్ధం అని ధాన్యలక్ష్మి తనకి నచ్చినట్లు మాట్లాడుతుంటుంది. ఆపండి అసలు మినిస్టర్ తో ఎందుకు గొడవ పడ్డామో తెలుసా.. మా కన్న బిడ్డ కోసం.. వాడు పుట్టగానే బిడ్డలని మార్చాడు అని జరిగింది మొత్తం చెప్పగానే అందరు షాక్ అవుతారు. అమ్మ కావ్య నువ్వు చెప్తుంటే మేమ్ పట్టించుకోలేదు పైగా ఎంత చెప్పినా వింటలేవు మూర్ఖురాలివి అంటూ తిట్టాను సారీ అని అపర్ణ అంటుంది. కన్నకూతురు కాకపోయినా తన ప్రాణం కాపాడాలని చూస్తున్నావ్ నువ్వు గొప్ప తల్లివి అని ఇందిరాదేవి అంటుంది. నేను నిజం తెలుసుకోకుండా మాట్లాడాను నన్ను క్షమించు అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత పాపని తీసుకొని రాజ్, కావ్య హాస్పిటల్ కి వెళ్తారు.

మరొకవైపు రుద్రాణికి రేఖ ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసిపోయిందా అని రుద్రాణి షాక్ అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు కావ్య పాపని, కావ్యని రాజ్ కి దూరం చేసి.. రాజ్ కి నిన్ను దగ్గర చేస్తానని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



