
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో నూకరాజు ఎవరి పెళ్లి ఎలా ఎవరితో జరగబోతోంది అన్న విషయాలను గురించి జాతకం చెప్పే రోల్ లో వచ్చాడు. "మనందరి సింగల్ జాతకాలు చెప్పడానికి వచ్చేస్తున్నాడు మా నూకరాజు " అంటూ శ్రీముఖి అనౌన్స్ చేసింది. ఇక నూకరాజు జాతకం చెప్పే వాళ్ళ గెటప్ లో వచ్చాడు. "ఏ అమ్మాయి పెళ్లిళ్లు చేసుకోరా మీరు " అంటూ షోకి వచ్చిన లేడీస్ ని అడిగాడు. వెంటనే దీపికా "మీలాంటి మొగుడు వస్తారేమో అని" అనేసరికి నూకరాజు షాకయ్యాడు.
"మీరు కూడా చేసుకోవచ్చు కదండీ" అంటూ శ్రీముఖి కౌంటర్ ఇచ్చింది. "నేను ఆల్రెడీ చేసుకునే తిట్లు తిని బయటికొచ్చా" అన్నాడు నవ్వుతూ. "నేను జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా" అన్నాడు నూకరాజు. "జరిగేది చెప్పు " అంటూ హరి అడిగాడు. "నువ్వు బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా వెళ్తావయ్యా. జరగబోయేదేంటో చెప్పనా హౌస్ లోకి వెళ్లిన మొదటి వారంలోనే " అన్నాడు. "ఏయ్ దాని బదులు వెళ్లకపోవడమే బెటర్ " అన్నాడు హరి నవ్వుతూ. "బాలు గారు మీ పెళ్లి ఎక్కడ జరుగుతుంది అంటే నిజామాబాదు " అంటూ అందరూ గట్టిగా అరిచారు. ఇక శ్రీముఖి సిగ్గుపడిపోయింది. "నీ పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుందనుకుంటున్నావ్ " అని బాలుని అడిగాడు. వెంటనే అవినాష్ వచ్చి నేను చెప్పనా ఎలా ఉంటుందో అన్నాడు వీడు మధ్యలో ఉంటాడు ఇంట్లో అంటూ శ్రీముఖి కామెడీ చేసింది. "నిఖిల్ గారి పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తెలుసా" అన్నాడు నూకరాజు. "అసలు జరుగుతుందా అయ్యగారు " అంటూ శ్రీముఖి అడిగింది. "ఏడెనిమిది బ్రేకప్పుల తర్వాత జరుగుతుంది " అని చెప్పాడు . "సర్ 17 - 18 అయ్యాయి అక్కడ" అంటూ నిఖిల్ పరువు తీసేసాడు. "దివి గారు మీ పెళ్లి ఎక్కడ జరగబోతోందో తెలుసా నడిరోడ్డు మీద జరగబోతోంది " అని చెప్పాడు
నూకరాజు. "నాకు కూడా జ్యోతిష్యుడు నడిరోడ్డు మీద జరుగుతుంది అని చెప్పాడు సర్ " అన్నాడు హరి. "నడిరోడ్డు మీద అడుక్కుంటావ్ అని చెప్పుంటాడు " అంటూ నూకరాజు కౌంటర్ వేసాడు. "నీ పెళ్లి పంచాయతీలో జరగబోతోంది " అంటూ అరియానా గురించి చెప్పాడు. "పంచాయతీలో ఎందుకు " అంది ఆరియానా. "దొరికిపోయినప్పుడు పంచాయతీకి తీసుకెళ్తారు " అంది శ్రీముఖి. "పండు నీ పెళ్లి ఎలా జరుగుతుందో తెలుసా" అన్నాడు. "నీ పెళ్లి చూడడానికి ఊరుఊరంతా వస్తుంది" అన్నాడు. "చెట్టుకు కట్టేసి కొడితే రారేంటి " అంటూ హరి కౌంటర్ వేసాడు. దాంతో పండుకు కోపం వచ్చింది.





