Brahmamudi : పెన్ డ్రైవ్ కోసం రౌడీలు వెతుకులాట.. రాజ్, కావ్యలకి పొంచి ఉన్న ప్రమాదం!
on Dec 5, 2025
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -896 లో....రాజ్, కావ్య హోటల్ కి వెళ్తుంటారు. అప్పుడే ఒకతడిని రౌడీలు వెంబడిస్తుంటారు. అతను వాళ్ళ కార్ ముందు వచ్చి ఆగుతాడు. వెంటనే రాజ్ కార్ ఆపి ఏమైందని అడుగుతాడు. రౌడీలు దూరం నుండి చూస్తుంటారు. అతను తన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ రాజ్ కి తెలియకుండా తన జేబులో వేస్తాడు. అతను చనిపోతాడు. అప్పుడే రౌడీ ఆ పెన్ డ్రైవ్ తీసుకుందామని అతని దగ్గరికి వస్తాడు.
అతను ఏమైనా చెప్పాడా అని రౌడీ లు అడుగుతారు. లేదని చెప్పి రాజ్, కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతారు. అసలు ఆ పెన్ డ్రైవ్ వీడి దగ్గర లేదు వాళ్లకు ఇచ్చేసి ఉంటాడా అని రౌడీలు అనుకుంటారు. మరొకవైపు కళ్యాణ్, అప్పు ఇంటికి వస్తారు. చాటుగా లోపలికి వెళ్తుంటే ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు.. ఇంత లేట్ అయిందని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అదేం లేదు అన్నయ్య వాళ్ళని డ్రాప్ చేసి హాస్పిటల్ కి వెళ్లి వచ్చామని కళ్యాణ్ అంటాడు. మరి హాస్పిటల్ లో టెస్ట్ లు చేసిన రిపోర్ట్స్ ఎక్కడ అని ధాన్యలక్ష్మి అంటుంది. ఎందుకు అన్ని ప్రశ్నలు వేస్తున్నావ్ రిపోర్ట్స్ రేపు వస్తాయని ప్రకాష్ అనగానే అవును నాన్న అని కళ్యాణ్ అంటాడు. ఇద్దరు ఎలాగో అలా తప్పించుకొని లోపలికి వెళ్తారు.
మరొకవైపు ఎవరు అతను అని కావ్య ఆలోచిస్తుంటే.. అదంతా ఏం ఆలోచించకు, ముందు ఇది తాగు అని రాజ్ ఇస్తాడు. చేదు ఉంది అని కావ్య అంటుంది. దాంతో రాజ్ పాట పాడి కావ్యని బుజ్జగించి అది తాగిపిస్తాడు. తరువాయి భాగంలో రౌడీ అయిన మోటు తన బాస్ దగ్గరికి వెళ్లి పెన్ డ్రైవ్ మిస్ అయిందని చెప్తాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు ఖచ్చితంగా పెన్ డ్రైవ్ తీసుకొని రమ్మని అతను చెప్తాడు. దాంతో రౌడీలు కావ్య, రాజ్ ని ఫాలో అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



