Brahmamudi: అటు కవి శోభనం.. ఇటు కావ్యకి రాజ్ ప్రపోజ్!
on May 27, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -731 లో.....రాహుల్ కంగారుగా గదిలో నుండి బయటకు వస్తుంటే స్వప్న చూసి.. ఏంటి అలా చెమటలు పడుతున్నాయని అడుగుతుంది. తనకి డౌట్ వచ్చి తన నగలు చెక్ చేసుకుంటుంది అన్ని ఉన్నాయి.. మరి నువ్వు ఎందుకు అలా కంగారు పడుతున్నావని రాహుల్ ని స్వప్న అడుగుతుంది. నీకు నేను ఎలా కన్పిస్తున్నానంటూ రాహుల్ అడుగుతాడు. ఇక అతను ఏదో ఒకటి కవర్ చేస్తాడు.
మరుసటి రోజు రాజ్ కోసం అపర్ణ ఇందిరాదేవి వెయిట్ చేస్తారు. రాజ్ పంతులు గారు ఒకటే సారి వస్తారు. పంతులుని ఎందుకు తీసుకొని వచ్చావని ఇందిరాదేవి అడుగుతుంది. రాజ్ తీసుకొని రాలేదు నేను పిలిపించానని ధాన్యలక్ష్మి అంటుంది. ఎందుకని అందరు అడుగుతారు. శోభనం ముహూర్తం పెట్టడానికి అని ధాన్యలక్ష్మి అనగానే ప్రకాష్ సిగ్గుపడతాడు. ఈ వయసులో మీకెందుకు శోభనం.. అప్పు, కళ్యాణ్ కి అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇప్పుడే ఎందుకు మాకు కొంచెం టైమ్ కావాలని అప్పు అంటుంది. ఇక టైం లేదని ధాన్యలక్ష్మి ముహూర్తం పెట్టిస్తుంది. ఈ వంకతో కావ్య గారికి ప్రపోజ్ చెయ్యాలని రాజ్ అనుకుంటాడు.
ఆ తర్వాత అపర్ణ, ఇందిరాదేవి ఇద్దరు రాజ్ ని పక్కకి తీసుకొని వెళ్లి అసలు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావని అడుగుతారు. అప్పు, కళ్యాణ్ శోభనం ఏర్పాట్లు చేసేటప్పుడు తనకి ప్రపోజ్ చేస్తానని రాజ్ అంటాడు. ఆ తర్వాత యామిని, రుద్రాణి ఫోన్ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



