
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -56 లో.... మురళిని పెళ్లి చేసుకోకుంటే చస్తానని శారద డోర్ వేసుకొని ఊరి వేసుకోవాలనుకుంటుంది. దాంతో డోర్ పగులగొట్టి శారద దగ్గరికి వెళ్తారు. శారద ఏడుస్తుంటే నందు కరిగిపోయి.. మురళితో పెళ్లికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత మురళి, నందులకి పెళ్లి జరుగుతుంది. మనం అలా ఎప్పుడు కూర్చుంటామోనని జానూతో సూర్య అంటాడు. నీ డెస్టినీని అడుగని జానూ అంటుంది మరొకవైపు సింహాద్రి మొహం మాడ్చుకొను చూస్తుంటే జాను తన దగ్గరికి వెళ్లి అంకుల్ ఆశీర్వదించండి అని అంటుంది.
మరొకవైపు మురళి పెళ్లిచూపూలు అని శాంతి హడావుడి చేస్తుంది. బ్యాండ్ మేళంతో వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. అప్పుడే పెళ్లి చేసుకున్న నందు, మురళి వస్తారు. వాళ్ళని చూసి శాంతి షాక్ అవుతుంది. వాళ్ళు మోసం అని తెలిసింది అమ్మ అందుకే నేను చేసుకున్నానని మురళి అనగానే ఓహ్ అది నిన్ను ఇష్టపడి చేసుకోలేదన్నమాట ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు.. దాని మెడలో నుంచి తాళి తీసేయ్ అని శాంతి తన మెడలో తాళి పట్టకుంటుంది. వదులు అమ్మ అని మురళి తన చెయ్ పట్టుకుంటాడు. ఆపండి అత్తయ్య అని జాను కోప్పడుతుంది. అన్ని మర్చిపోయి మమ్మల్ని ఆశీర్వదించండి అని మురళి అనగానే నువ్వు ఒక్కడివి అయితే లోపలికిరా లేదంటే రాకు అని శాంతి తెగేసి చెప్తుంది.
మరొకవైపు శారద ఇంట్లో అందరికి కూల్ డ్రింక్ ఇస్తుందిమ అప్పుడే మురళి, నందులని తీసుకొని జానూ వస్తుంది. దాంతో శారద షాక్ అవుతుంది. అక్కడున్న వాళ్లంతా శాంతి ఒప్పుకోలేదనుకుంటా కట్నం తేకుండా ఫ్రీగా వెళ్తే అసలు ఊరుకోదని అక్కడున్న వాళ్ళు అంటారు. తరువాయి భాగంలో నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఈ పెళ్లి జరిపించారని నందు ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






