krishna Mukunda Murari : కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో అదిరిపోయే ట్విస్ట్..
on Nov 27, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -325 లో.. కృష్ణని బ్రేక్ ఫాస్ట్ కి పిలిచి ముకుంద, మురారీల పెళ్లి చేస్తున్నానని అనగానే.. కృష్ణ షాక్ అవుతుంది. ఇక అక్కడ ఉండలేక కృష్ణ తన ఇంటికి వస్తుంటే.. అప్పుడే కృష్ణ కోసం మురారి తన ఇంటికి వెళ్లి కృష్ణ గురించి అడుగుతుంటాడు. అప్పుడే బాధగా వస్తున్న కృష్ణని చూసి.. ఏమైంది మా పెద్దమ్మ నిన్ను ఎందుకు పిలిచిందంటు అడుగుతాడు మురారి.
ఆ తర్వాత మీ హెల్త్ గురించి తెలుసుకోవడానికి పిలిచిందని కృష్ణ చెప్పగానే.. మీరు అబద్ధం చెప్తున్నారని క్లియర్ గా అర్థం అవుతుంది. నేనే వెళ్లి అడుగుతానని మురారి అంటాడు. మరొకవైపు భవాని ఎలాగైనా పెళ్లి విషయం అర్థం అయ్యేలా మురారికి చెప్పాలని అనుకుంటుంది. వాని జీవితం కోసం రెండు మూడు అబద్ధాలు ఆడిన తప్పు లేదని భవాని అనుకుంటుంది. అప్పుడే భవాని దగ్గరికి రేవతి వచ్చి.. మీరు తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో ఒకసారి అలోచించండని అనగానే నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదంటూ మళ్ళీ కృష్ణ చేసిన తప్పుని గుర్తు చేస్తుంటుంది భవాని. అప్పుడే మురారి వచ్చి.. మీరు కృష్ణ ని ఏం అన్నారని అడుగుతాడు. మేం ఏం అనలేదని చెప్పగానే మరి నేను లేని టైమ్ లో తనని బ్రేక్ ఫాస్ట్ కి ఎందుకు పిలిచారని మురారి అడుగుతాడు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని మురారి అనగానే.. అవును దాస్తున్నాను. అది రెండు రోజుల తర్వాత చెప్తానని భవాని అంటుంది. మరొకవైపు మురారి కోపంగా వెళ్ళాడు. పెద్ద అత్తయ్యతో ఏమైనా గొడవ పడుతున్నడెమో అనుకొని కృష్ణ కంగారుపడుతుంది. అప్పుడే కృష్ణ దగ్గరికి మురారి వచ్చి. పెద్దమ్మ ఏం చెప్పలేదు. రెండు రోజుల తర్వాత చెప్తానని చెప్పిందని కృష్ణకి చెప్తాడు. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు టిఫిన్ చేస్తారు.
ఆ తర్వాత కృష్ణకి మురారి టిఫిన్ తినిపిస్తాడు. మరొకవైపు కృష్ణ జీవితం అలా అయిపోతుందని నందు ఏడుస్తుంటుంది. ఆ తర్వాత కృష్ణ ఇంట్లో అందరిని ఎదురించి మన పెళ్లి చేసిందని నందు అనగానే.. మనం ఇక్కడే ఉండి కృష్ణ, మురారీలని కలపాలని గౌతమ్ అంటాడు. మరొక వైపు మురారి జీవితం గురించి రేవతి బాధపడుతుంటే, తనకి కోపం వచ్చేలా ముకుంద మాట్లాడుతుంది. అన్ని పక్కన పెట్టి పెళ్లి పనులు మొదలు పెట్టండని ముకుంద చెప్పగానే రేవతి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
