Bigboss 9 Telugu : బిగ్బాస్ నే మార్చేసిన నాగార్జున...ఈసారి చదరంగం కాదు..రణరంగమే!
on Aug 11, 2025

బిగ్ బాస్ రియాలిటి షో మొదలు కావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ టీమ్ ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. అన్ని సీజన్ ల కంటే ఈ సీజన్ భిన్నంగా ఉండబోతుందనేది ఈ ప్రోమోని చూస్తే తెలుస్తుంది. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఒక మినీ యుద్ధమే గెలవాలన్నట్లుగా ప్రోమో ఉంది. షోకి సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్ కి కూడా ఆహ్వానం ఉంది.
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సెలెక్షన్ లో భాగంగా లక్షలో అప్లికేషన్ వచ్చాయంట. అందులో బిగ్ బాస్ కొంతమందిని సెలక్ట్ చేసారని వారికి ఓ సవాలు ఇచ్చారంట. సెలక్ట్ చేసిన వాళ్ళకి 'అగ్నిపరీక్ష' ఉంటుందంట.. అది గెలిస్తేనే హౌస్ లోకి ఎంట్రీ ఉంటుంది. ఈ అగ్నిపరీక్షకి నలభై అయిదు మంది(45) వెళ్లారట. ఈ అగ్నిపరీక్షకి బిందు మాధవి, నవదీప్,అభిజిత్ జడ్జులుగా ఉన్నారు . ఈ ముగ్గురు కూడా అగ్నిపరీక్ష ద్వారా హౌస్ లోకి వెళ్లే వాళ్ళని ఎంపిక చేస్తారని తెలుస్తోంది.
ఈ అగ్ని పరీక్షలో భాగంగా పదిహేను మంది అర్హత సాధించారని తెలుస్తోంది. ముగ్గురు జడ్జులు ఒక్కొక్కరు అయిదుగురు కంటెస్టెంట్స్ ని కలిగి మూడు టీమ్ లుగా డివైడ్ అవుతారు. మూడు గ్రూప్ లకి జడ్జెస్ హెడ్.. వాళ్ళ గ్రూప్ లలో పర్ఫామెన్స్ ని బట్టి సెలెక్ట్ చేస్తారు. అలా పర్ఫామెన్స్ ని బట్టీ ఒక్కో టీమ్ నుండి కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపిస్తున్నారట ఇంకా పన్నెండు మందికి ఆడియన్స్ పోల్ పెడుతారంట. ఓటింగ్ లో టాప్ 2 లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ హౌస్ లోకి ఎంట్రీ ఉంటుందని.. అలా హౌస్ లోకి ఇప్పటి వరకు అయిదుగురు కంటెస్టెంట్స్ కన్ఫమ్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఈ అగ్నిపరీక్ష షూటింగ్ జరుగుతుందని.. ఈ నెల 22 న జియో హాట్ స్టార్ లో బిగ్ బాస్ అట్టహాసంగా మొదలవబోతుందని తెలుస్తోంది. మరి మీలో ఎంతమంది ఈ బిగ్ బాస్ సీజన్ 9 చూడటం కోసం ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



