.webp)
బిగ్ బాస్ ఇంట్లో పదో వారం నామినేషన్స్ ఫుల్ హీట్ ఎక్కేలా ఉంది. మరీ ముఖ్యంగా సుధీర్, ముకేష్ మధ్య మాటల యుద్దం జరిగింది. శివ్ సైతం ముఖేష్ మీద నామినేషన్ వేశాడు. ఇక నరేష్, నీతూ మధ్య కూడా ఫన్నీగా సంభాషణ జరిగింది. ఇది న్యాయమా? అని నీతూ అడిగితే.. కాదు అన్యాయం ఓకేనా? అని నరేష్ కౌంటర్ వేస్తాడు. ముఖేష్, సుధీర్ మధ్య పెద్ద గొడవే జరిగింది.
నేను నిన్ను నమ్మినందుకు రియలైజ్ అవుతున్నా అని వర్షిణి అంటే.. నేను కూడా అని సుధీర్ అంటాడు. ఇంట్లో ఉండేందుకు అర్హురాలు కాదని వంశీ అన్నాడు. మీరు మాత్రం సిగ్గు లజ్జ అని అన్నారు కదా.. మీకు అర్హత ఉందా? మరి అని నీతూ అంటుంది. ఏ మీరు చెప్పలేదా? కారు అమ్మి స్కూటీ కొన్నాం అని.. త్రిగుణ్ చెప్తుంటే.. ఏయ్ జోకర్ అని నీతూ కౌంటర్ వేస్తుంది. మా ఫ్యామిలీ, మా కష్టాల మీద మాట్లాడినప్పుడు లేదా అని త్రిగుణ్ అంటుంటే.. తనని తాను చెంప మీద కొట్టుకుంది నీతూ.
ఆ తర్వాత నీతూని దేబ్జానీ నామినేషన్ చేసింది. నరేష్ కూడా నీతూని నామినేషన్ చేయగా వర్షిణిని రామ్ ప్రసాద్ నామినేషన్ చేశాడు. సుధీర్ ని వర్షిణి నామినేషన్ చేసింది. నీతూని శ్వేత నామినేషన్ చేసింది. నువ్వేమో పొడిచేస్తానని అన్నావ్ కానీ అదేం చేయలేదు.. ఎందుకంటే నీ గన్ లో బుల్లెట్లు లేవని నీతూతో శ్వేత నామినేషన్ చేసింది. నీ దగ్గర ఏం పాయింట్లు లేక ఇలాంటి సేఫ్ నామినేషన్ చేస్తున్నావ్.. నువ్వు సేఫ్ ప్లేయర్ అని నీతూ అంది. సుధీర్ ని ముఖేష్ నామినేషన్ చేశాడు. వెన్నుపోటు పొడిచావని నోటికి ఇష్టమొచ్చినట్టు ముఖేష్ మాట్లాడాడు. ఇక అందరి నామినేషన్ ముగిసాక బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఉన్న బెంచ్ కింద ఒక ఎన్వలప్ ఉంది దానిని ఓపెన్ చేసి చదవండి అని వంశీతో బిగ్ బాస్ చెప్తాడు. ఈ వారం నాది... మీ వ్యక్తిగత కారణాల వల్ల మీ నామినేషన్ చేశారు.. కానీ ఈ వారం అందరు నామినేషన్లో ఉంటారని బిగ్ బాస్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఇదెక్కడి మాస్ రా మావ అని బిగ్ బాస్ ఆడియన్స్ అనుకున్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.





.webp)
