Home

»

Tv News

ఫైమా ప్రెగ్నెన్సీ న్యూస్.. తల్లి కాబోతుందంటూ వీడియో.. చివర్లో ట్విస్ట్!

Nov 9, 2026 5:36PM

జబర్దస్త్ ఫైమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు బుల్లితెరపై లేడీ కమెడియన్‌గా  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదట పటాస్ షోతో ఆడియన్స్ కి  దగ్గరైన ఫైమా.. ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు టీవీ షోల్లో తన కామెడీతో అలరించింది. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ కంటెస్టెంట్‌గా పాల్గొని ఆడియన్స్ కి  మరింత దగ్గరైంది. ప్రస్తుతం జబర్దస్త్‌తో పాటు ఇతర టీవీ కార్యక్రమాల్లోనూ బిజీగా ఉంటోంది ఫైమా. అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహించడంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ఇదిలా ఉంటే, తాజాగా ఫైమా షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  కొన్ని నెలల క్రితం తన స్నేహితుడు  ప్రవీణ్‌ను వివాహం చేసుకున్న ఫైమా ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తల్లి కాబోతోందంటూ ఓ వీడియో పోస్ట్ చేయడంతో ఫాన్స్  ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ వీడియోలో ఫైమా ఓ ఆస్పత్రిలో ఉన్నట్లు కనిపిస్తుంది. అక్కడ డాక్టర్ ఆమెతో మాట్లాడుతూ.. "మీరు తల్లి కాబోతున్నారు కంగ్రాట్స్ " అన్నారు . దీంతో ఫైమా ఎంతో సంతోషంగా స్పందిస్తుంది. ఈ వీడియో చూసిన అభిమానులు కూడా నిజంగానే ఫైమా ప్రెగ్నెంట్ అని భావించి విషెస్ చెప్పడం స్టార్ట్ చేశారు.

కానీ అసలు విషయం తెలిసాక  అందరికీ షాక్ తగిలింది. ఇదంతా ఒక హాస్పిటల్ ప్రమోషన్‌లో భాగమని ఫైమా చివర్లో రివీల్ చేసింది.  మీరు కూడా ఇలాంటి గుడ్ న్యూస్ వినాలనుకుంటే ఈ హాస్పిటల్ లో చేరండి  అంటూ హాస్పిటల్‌ను ప్రమోట్ చేసింది.   ఫైమా నిజంగానే తల్లి కాబోతోందా? లేక ప్రమోషనల్ యాడ్ కోసం  ఇలా ప్రెగ్నెన్సీ  న్యూస్ ని షేర్ చేసిందా అని కామెంట్స్ చేసుకుంటున్నారు.  ఇంకొంతమంది ఐతే ఇలాంటి పర్సనల్ ఇంపార్టెంట్  విషయాలను హాస్పిటల్  ప్రమోషన్ కోసం వాడుకోడం కరెక్ట్ కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు.  ఐతే గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ప్రెగ్నెన్సీ గురించి ఫైమా స్పందించింది. ప్రస్తుతం అలాంటి గుడ్ న్యూస్ ఏమీ లేదని, భవిష్యత్తులో ఏదైనా శుభవార్త ఉంటే ముందుగా  ఫాన్స్  తోనే షేర్ చేసుకుంటానని  చెప్పింది.  
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com