Home

»

Tv News

BiggBoss 10 Telugu:నాగార్జున తీరుపై బిగ్ బాస్ కౌశల్ రియాక్షన్!

Nov 9, 2026 8:38AM

బిగ్ బాస్ ఇంట్లో 9వ వారంలో జరిగిన నామినేషన్స్, అందులో కంటెస్టెంట్లు ఒకరిపై మరొకరు అరిచేసుకున్న సంగతి తెలిసిందే. అందులో వంశీ ఓ చోట నోరు జారాడు. ఝాన్సీని ఇంట్లోంచి పంపించి.. మీరంతా కులుకుతూ ఉన్నారని ముఖేష్ మీద విమర్శలు చేస్తాడు. కులకడం ఏంటని వర్షిణి, సుధీర్ ఇద్దరు అబ్జెక్ట్ చేస్తారు. మీరంతా అక్కడ కూర్చుని నవ్వుతున్నారు కదా అదే అని అంటాడు వంశీ. మీకు ఇంకా ఏమైనా డబుల్ మీనింగ్ ఉందా? అని అంటాడు వంశీ. అక్కడ వంశీ ఉద్దేశం తప్పు లేకపోయినా పదాల వాడుక మాత్రం తప్పే. ఇక అదే విషయాన్ని నాగార్జున చెప్పే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా కులకడం అనే పదానికి మీనింగ్ కూడా చెప్పాడు.కులకడం అంటే వయ్యారాలు పోవడమని అన్నాడు.

ఇందులో వర్షిణిది, వంశీది ఇద్దరిదీ తప్పే ఉందని, మీరు మాత్రం బీ, పీ అని ఇష్టం ఉన్న పదాల్ని వాడేస్తారు.. వాళ్లు మాత్రం ఏదైనా అంటే తీసుకోలేరా అని నాగార్జున అంటాడు. వర్షిణి నువ్వు అన్న పీ అండ్ బీ మాటలతో పోల్చితే అదేం పెద్ద తప్పు కాదులే అంటూ ఆమెకే కౌంటర్ ఇచ్చాడు. వంశీ అన్న మాట కాస్త అభ్యంతరకరమే.. కానీ వర్షిణి ఆ మాటని తప్పు అనడమే వింతగా ఉంది అంటూ నాగార్జున సెటైర్లు వేశాడు. ఫుడ్ విషయంలో వర్షిణి నిర్లక్ష్యంగా ఉందని, హౌస్ లో వర్షిణి క్రమంగా షాలినిలా మారుతోందంటూ సెటైర్లు వేశాడు.

అయితే ఈ కులకడం వ్యవహారం మీద బిగ్ బాస్ సీజన్-2 విన్నర్ కౌశల్ రియాక్ట్ అయ్యాడు. నా సీజన్ లో కపట నాటకం ఎలా ఫేమస్ అయిందో.. ఇప్పుడు కులకడం అనేది కూడా అంతే ఫేమస్ అయింది.. ఈ కులకడం అనే పదాన్ని మనం ఎలా వ్యవహరిస్తామో, ఏ సందర్భంలో వ్యవహరిస్తామో తెలిసిందే.. ఓ ఇద్దరి మధ్య ఈ పదాన్ని వాడితే.. తప్పుగా వెళ్తుంది.. ఒక్కరి గురించే మాట్లాడితే ఇంకోలా వెళ్తుంది.. కులకడం అంటే వయ్యారాలు పోవడం అని నాగార్జున గారు ఎంత నీట్ గా, కూల్ గా వ్యవహరించారు.. అయితే పదాల అర్థం కంటే.. ఒక్కోసారి ఏ సందర్భంలో ఏ టోన్ లో వాడారు అన్నది ఇంపార్టెంట్ అవుతుందని కౌశల్ చెప్పుకొచ్చాడు. పోరా అని నార్మల్ గా అన్న దానికి.. హే పోరా అని కోపంగా అన్న దానికి.. పోరా అని చిరాగ్గా, ద్వేషంతో అన్న దానికి తేడా ఉంటుంది.. అక్కడ ఆ కంటెస్టెంట్ కులకడం అని ఏ టోన్ లో అన్నారో.. ఏ సందర్భంలో అన్నారో అందరం చూశామని కౌశల్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ వరస్ట్ గా ఉంది.. కంటెస్టెంట్లు అందరూ అలానే ఉన్నారు.. నాగార్జున వరస్ట్ హోస్టింగ్ అంటూ కౌశల్ వీడియో కింద నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com