
బిగ్ బాస్ ఇంట్లో 9వ వారం గ్రూపుల్లో పెద్ద మార్పులు వచ్చాయి. ఇంత వరకు సుధీర్, వర్షిణి, ముకేష్ ఓ గ్రూపులో ఉండేవారు. కానీ ఆ గ్రూపు నుంచి సుధీర్ బయటకు వచ్చాడు. తను ఇకపై సొంతంగా ఆట ఆడతానని చెప్పుకుంటూ ఉంటున్నాడు. తను ఆ గ్యాంగులో ఒకడ్ని కాదని సందర్భం వచ్చినప్పుడల్లా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సండే ఫండే టాస్కులోనూ అలాంటి ప్రయత్నమే సుధీర్ చేసినట్టు అనిపిస్తోంది. సండే ఫండేలో భాగంగా పెట్టిన బీబీ సినిమా టాస్కులో సుధీర్, వర్షిణి, ముఖేష్ మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది.
బోర్డ్ మీదున్న సినిమా పేర్లకు ఇంట్లోని కంటెస్టెంట్లలో ఎవరికి సెట్ అవుతుందో చెప్పాలి.. ఎందుకు సెట్ అవుతుందో కూడా చెప్పాలని టాస్క్ ఇస్తాడు నాగార్జున. ఇందులో వంశీ మొదటగా వచ్చి.. ఫస్ట్ వీక్ ఫైర్.. నెక్ట్స్ వీక్ ఎక్స్ పైర్ అని నీతూ గురించి చెప్తాడు. వాల్యూమ్ ఫుల్, వాలిడ్ పాయింట్ నిల్ అని త్రిగుణ్ గురించి ముఖేష్ చెప్తాడు. నా వరకు వచ్చేసరికి ఎలాంటి వాలిడ్ పాయింట్స్ పెట్టడు.. ఊరికే ఏదో ఒకటి అరవడం అన్నట్టుగానే ఉంటుందని ముఖేష్ అంటాడు. స్నేహం నా పేరు.. మోసం నా ఊరు అని ముఖేష్ కి ఇస్తాడు త్రిగుణ్. ఇన్ని రోజులు సుధీర్ వాళ్ల గ్యాంగ్ లోనే ఉన్నా త్రిగుణ్ మాత్రం ముఖేష్ ని టార్గెట్ చేశాడు.ప్రజెన్స్ ఉంది.. పర్పస్ లేదని వర్షిణి గురించి సుధీర్ చెప్తాడు. సుధీర్ చెప్పిన దానికి నో రెస్పాన్స్ అని వర్షిణిని ఇంకా రెచ్చగొడతాడు నాగార్జున.ఫ్యామిలీ నుంచి వెళ్లిపోయాడు కదా.. మా మీద వేయడమే సేఫ్ అనుకుని వేశాడు.. అది మాకు తెలుసు సర్.. అయినా మీరు మొదట్లోనే చెప్పారు.. ఏదో ఒక రోజు సుధీర్ కాటు వేస్తాడని.. ఇప్పుడు వేశాడని వర్షిణి అంటే.. నన్నూ కలిపి ఒకేసారి కాటు వేశాడు అని ముఖేష్ అంటాడు. సుధీర్ మా ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్ళాడు. మమ్మల్ని కాటేయడమే సేఫ్ అని భావించి ఉంటాడంటూ వర్షిణి కౌంటర్ ఇచ్చింది.
ఈ గొడవతో సుధీర్, ముఖేష్-వర్షిణి మధ్య దూరం మరింత పెరిగినట్టు అనిపిస్తోంది. ఇప్పటివరకు ఒకే గ్రూప్ గా ఉన్న ముగ్గురు ఇప్పుడు విడిపోవడంతో హౌస్ లో కొత్త గ్రూప్ పాలిటిక్స్ మొదలయ్యాయి. సుధీర్ ఒంటరిగా ఆడుతున్నాడా లేక కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నాడా అనేది వచ్చే ఎపిసోడ్ లలో తేలనుంది. మరోవైపు ముఖేష్-వర్షిణి జోడీ మళ్లీ కలిసిపోతుందా లేదా సుధీర్ తో గొడవ ఇంకా ముదురుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




.webp)
.webp)
