Home

»

Tv News

Bigg Boss 10 Telugu : రోహిత్ రీఎంట్రీ.. లోపలికి వచ్చేస్తున్నాడా? అసలు నిజం ఏంటి?

Nov 9, 2026 8:31AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10లో షాకింగ్ ట్విస్ట్ గా రోహిత్ నాయుడు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల ఓటింగ్ తో కాకుండా హౌస్ మేట్స్ ఓటింగ్ తో అతను బయటకు వెళ్లడం అందరినీ షాక్ కి గురిచేసింది. టైటిల్ రేసులో టాప్-5లో ఉంటాడనుకున్న రోహిత్ 8 వారాలకే జర్నీ ముగించాడు. అప్పటి నుంచి రోహిత్ ఫ్యాన్స్ మేకర్స్ ని రీ-ఎంట్రీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో #JusticeForRohit, #RohitReEntry అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ వీకెండ్ ఎపిసోడ్ లో రోహిత్ మళ్లీ హౌస్ లోకి వస్తాడనే రూమర్లు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా బిగ్ బాస్ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

రోహిత్ రీ-ఎంట్రీపై అనుమానాలకు ప్రధాన కారణం బిగ్ బాస్ సీజన్-4 విన్నర్ అభిజీత్ ట్వీట్. “The Sun Will Shine Again” అంటూ అభిజీత్ పెట్టిన క్రిప్టిక్ పోస్ట్ ఫ్యాన్స్ లో ఆశలు రేపింది. రోహిత్ ని అగ్నిపరీక్షలో సెలెక్ట్ చేసింది అభిజీతే కావడంతో, అతని మెంటార్ గా ఈ ట్వీట్ రోహిత్ కోసమే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే ఎలిమినేట్ అయిన తర్వాత రోహిత్ మీడియా ఇంటర్వ్యూలకు దూరంగా ఉండటం, మైక్ విసరకుండా వెళ్లడం కూడా రీ-ఎంట్రీ ప్రోటోకాల్ లో భాగమేనని అంటున్నారు. గతంలో చరణ్, శాలినీ లాంటి వాళ్లకు సెకెండ్ ఛాన్స్ ఇచ్చినట్టే రోహిత్ కి కూడా ఇస్తారని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఈ సీజన్ లోనే ఆర్జే చరణ్ రీ-ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి రోహిత్ కి కూడా ఛాన్స్ ఉందని అంటున్నారు.

అయితే రోహిత్ రీ-ఎంట్రీ అంత ఈజీ కాదని మరికొందరు అంటున్నారు. అతను హౌస్ నుంచి బయటకు వెళ్లి బయట ఏం జరుగుతుందో తెలుసుకున్నాడు. మిగతా కంటెస్టెంట్లకు బయట విషయాలు తెలియవు. ఇలాంటి సమయంలో అతన్ని మళ్లీ లోపలికి పంపితే మిగతా వాళ్లకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు. అలాగే రోహిత్ అగ్రెసివ్ బిహేవియర్, త్రిగుణ్ ని బయట కలుస్తానని బెదిరించడం, మిడ్ నైట్ కాంట్రవర్సీలు కూడా అతని రీ-ఎంట్రీకి అడ్డంకిగా మారాయని టాక్ ఉంది. ఎలిమినేషన్ తర్వాత రోహిత్ తన మేనల్లుడితో ఫోటో షేర్ చేసి, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తుండటంతో అతను మూవ్ ఆన్ అయ్యాడనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.మొత్తంగా రోహిత్ రీ-ఎంట్రీ ఇంకా కేవలం రూమర్ గానే ఉంది. మేకర్స్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. టీఆర్పీ కోసం మేకర్స్ అతన్ని తీసుకురావచ్చని కొందరు, అది జరగదని మరికొందరు అంటున్నారు. దీపావళి వీక్ లో నో ఎలిమినేషన్ తో హౌస్ అలాగే ఉండగా, వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని టాక్ నడుస్తోంది. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com