Home

»

Tv News

Bigg Boss 10 Telugu: సుధీర్‌కు జిమ్ జిమ్ తార లక్ష్మీదేవి సపోర్ట్!

Nov 8, 2026 2:01PM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 తొమ్మిదో వారం వీకెండ్ కి వచ్చేసింది. ఈ వారం ఎలిమినేషన్ కోసం ఏకంగా 10 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారు. యాంకర్ వర్షిణి, ముఖేష్ గౌడ, అమన్ మసూద్, టెంపర్ వంశీ, నీతూ మాస్టర్, శివ కుమార్, నరేష్, దేబ్జానీ, సుధీర్, రామ్ ప్రసాద్ లు నామినేషన్లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారా? లేదా ఇద్దరు బయటకు వెళ్లిపోతారా? అన్నది ఆదివారం ఎపిసోడ్ తో తెలియనుంది. వీరిలో ఓ కంటెస్టెంట్ కి మన జిమ్ జిమ్ తార సింగర్ లక్ష్మీ సపోర్ట్ చేస్తోంది.

తాజాగా జిమ్ జిమ్ తార సింగర్ లక్ష్మీదేవి కూడా ఓ కంటెస్టెంట్ కు మద్దతుగా వీడియో రిలీజ్ చేసింది. జిమ్ జిమ్ తార పాటతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన గోకుల లక్ష్మీదేవి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఆమె పాడిన పాటలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘జిమ్ జిమ్ తార.. జిలేబి తేరా చిన్నోడా’ పాటతో లక్ష్మీ ఆంటీకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది.సోషల్ మీడియాలో ఆమెను చాలామంది లక్ష్మీ ఆంటీ అని కూడా పిలుస్తుంటారు. 

ఇటీవల ఈమె బిగ్ బాస్ తెలుగు 10 గురించి ఆసక్తికరంగా స్పందించారు. ఈ సీజన్ లో కొనసాగుతున్న ఓ కంటెస్టెంట్ కు తన మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. తనకు నచ్చిన కంటెస్టెంట్ కు ప్రేక్షకులు ఓటేసి గెలిపించాలని ఆమె ప్రత్యేకంగా కోరారు. ఇంతకి లక్ష్మీ ఆంటీ ఎవరికి మద్దతు తెలిపారంటే.. బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ సుధీర్ కు. “మన రాయలసీమ ముద్దుబిడ్డ సుధీర్ చాలా మంచివాడు, అతనికి అందరూ ఓటేసి గెలిపించాలి” అంటూ లక్ష్మీ ఆంటీ స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. 

లక్ష్మీ ఆంటీ రాయలసీమ లోని కర్నూల్ ప్రాంతానికి చెందినది కావడం, సుధీర్ కూడా రాయలసీమ (నంద్యాల) కు చెందినవాడు కావడంతో మన ప్రాంతం పిల్లోడు కదా, ఎలాగైనా గెలవాలన్న ప్రేమతో ఆ వీడియో చేసి ఉండొచ్చని అభిమానులు అంటున్నారు. 

జిమ్ జిమ్ తార పాట మాత్రమే కాకుండా గతంలో అత్తరు సాయిబో రారా అంటూ ఎన్నో పాటలు పాడి బాగా ఫేమస్ అయ్యింది లక్ష్మీదేవి. ఆమె వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సుధీర్ ఆర్మీ కూడా ఈ వీడియోను తెగ షేర్ చేస్తోంది.

ఏదేమైనా లక్ష్మీదేవి సపోర్ట్ తో సుధీర్ కు ఓటింగ్ లో భారీగా కలిసి వస్తుందని అతని అభిమానులు భావిస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న సుధీర్ సేవ్ అవుతాడా లేదా అనేది ఆదివారం ఎపిసోడ్ లో తేలనుంది.

 

 

 

[Jim Jim Tara Lakshmi Devi, Bigg Boss Sudheer Reddy, Bigg Boss 10 Telugu, Bigg Boss Telugu 10, Jim Jim Tara Song, Attaru Saibo Raara Song, Telugu TV News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com