డబుల్ ఎలిమినేషన్‌తో రతిక, ప్రియాంక అవుట్!
on Sep 30, 2023
నాల్గవ వారం బిగ్ బాస్ హౌజ్ లో అతి తక్కువ ఆట ఆడిన వారిలో ప్రియాంక జైన్, రతిక, టేస్టీ తేజ ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు. అయితే మొదటి ఎలిమినేషన్ గా టేస్టి తేజ, ఆ తర్వాత డబుల్ ఎలిమినేషన్ ఉంటే ప్రియాంక జైన్ బయటకు వచ్చే ఛాన్స్ చాలానే ఉన్నాయి. ప్రియాంక జైన్ ఎలిమినేషన్ అవ్వాడానికి కారణాలు చాలానే ఉన్నాయి.
బిగ్ బాస్ హౌజ్ లో మంచిగా ఉన్నట్టు నటిస్తూ మాస్క్ వేసుకునే వారికి ప్రేక్షకులు అసలు ఓట్లు వేయరు. ఇప్పుడు అదే జరిగింది. గతవారం నుండి నామినేషన్లలో ఉన్నవాళ్ళకి ఓటింగ్ జరుగుతుంది. అయితే ఈ ఓటింగ్ లో ప్రిన్స్ యావర్ కి వందకి తొంభై శాతం ఓట్లు పడ్డాయి. మిగిలిన ఓట్లు శుభశ్రీ కి పడగా, ఆ తర్వాత గౌతమ్ కృష్ణ ఉన్నాడు. ఇక చివరి మూడు స్థానాలలో టేస్టి తేజ, ప్రియాంక జైన్ ,రతిక ఉన్నారు. అయితే ప్రియాంక జైన్ ఏ టాస్క్ లోను గెలవలేదు. పైగ అమర్ దీప్ ఫెయిల్యూర్ అయ్యాడంటూ అతడినే నామినేట్ చేసింది.
ఇక మొన్న జరిగిన బిబి కాయిన్స్ టాస్క్ లో అమర్ దీప్ తో ఒక్క కాయిన్ కోసం గొడవ పడింది. తనకోసం అమర్ దీప్ గేమ్ ని వదులుకుంటే, ప్రియాంక మాత్రం అమర్ దీప్ కి ఒక్క కాయిన్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడే తెలిసిపోతుంది తనేంటో, అమర్ దీప్, శోభా శెట్టిలని ఫ్రెండ్స్ అంటూ తన స్వార్థం చూసుకుంటుంది ప్రియాంక జైన్.
రతిక తన అనవసరపు మాటలతో రోజు రోజుకి అందరి చేత తిట్డించుకుంటుంది. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేస్తూ తన మాటలు విన్న ఆమె ఫ్యాన్స్ కూడా అసహ్యించుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇక టేస్టి తేజ గతవాతం నాగార్జున చెప్పినట్లుగానే ఏం పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. దాంతో అతను ఓటింగ్ లో లాస్ట్ లో ఉన్నాడు. ఈ వారం ఎలిమినేషన్ లో డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఒకవేళ బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ పెడితే రతికతో పాటుగా ప్రియాంక జైన్ కూడా ఎలిమినేట్ అవుతుంది. మరి బిగ్ బాస్ అఫీషియల్ ఓటింగ్ రిజల్ట్స్ బట్టి ఎలిమినేషన్ చేస్తాడా లేక ఉల్టా పల్టా అంటూ రతిక, టేస్టి తేజలని ఎలిమినేషన్ చేస్తాడా చూడాలి మరి. అయితే ప్రియాంక జైన్ లాంటి కన్నింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు లేకుంటే హౌజ్ లో గొడవలు జరుగవు కదా? మరి కంటెంట్ ఎలా వస్తుందని బిగ్ బాస్ ఆలోచిస్తాడా లేక ప్రజలిచ్చిన ఓటింగ్ తీర్పుకి రుణపడి ప్రియాంక జైన్, రతికలని ఎలిమినేషన్ చేస్తాడా చూడాలి మరి!

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
