నాకు పేరు పెట్టింది హీరో నాగార్జున ..అసలు పేరు అది కాదు
on Jan 25, 2026
మోడలింగ్ తో కెరీర్ స్టార్ట్ చేసిన దివి తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళింది. ఎన్నో మూవీస్ లో కూడా నటించింది. ఆమెకు పేరు తెచ్చిన సినిమాలు మహర్షి, రుద్రంగి, లంబసింగి, హరికథ చిత్రాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఐతే దివి పేరు అసలు పేరు అది కాదు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. "నా అసలు పేరు దివ్య. మా క్లాస్ లో ప్రతీ వంద మందిలో నలుగురికి దివ్య అన్న పేరు ఉండేది. నన్ను పొడుగు దివ్య అని పిలిచేవాళ్ళు. ఇంకో అమ్మాయిని పొట్టి దివ్య అని ఇంకో అమ్మాయిని వెడల్పు దివ్య అని పిలిచేవాళ్ళు. ఐతే నా పేరు స్క్రీన్ కి బాగుండాలి అని దివి అని మార్చుకున్నా. ఐతే బిగ్ బాస్ సీజన్ 4 స్టేజి మీదకు వెళ్ళా. నాగ్ సర్ వచ్చే ముందే దివ్య అని ఇంట్రడ్యూస్ చేస్తే సారీ నా పేరు దివ్య కాదు దివి అని పిలవండి, దివి అంటే ఇష్టం అని చెప్తున్నాను ఇంతలో నాగ్ సర్ ఎంటర్ అయ్యి ఇక ఇప్పటి నుంచి ఈమెను దివి అని పిలవండి అంటూ అనౌన్స్ చేశారు. అలా అఫీషియల్ గా ఆన్ స్క్రీన్ మీద దివి అంటూ అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి అందరూ దివి అని పిలవడం స్టార్ట్ చేశారు." ఐతే దివి అంటూ పేరు పెట్టింది నాగ్ సర్ ఆ మన్మధుడు అంటూ హోస్ట్ వర్ష తెగ మెచ్చేసుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఒకట్రెండు సినిమాల్లో నటించింది. అలాగే గాడ్ ఫాదర్ మూవీలో కూడా కనిపించింది. ఇక హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది దివి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



