Bigg boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ లో అందరు దొంగలే.. దొరికితే!
on Sep 13, 2025
.webp)
బిగ్ బాస్ హౌస్ లో దొంగలు పడ్డారు. అవును నిజమే.. హౌస్ లో ఒకరికి మించి ఒకరు దొంగతనం చెయ్యడంలో పీహెచ్ డి పట్టా పొందారు. సంజన కెప్టెన్ కాగానే తనకంటూ సపరేట్ గా లగ్జరీ వస్తుంది. హ్యాంపర్ లో చాక్లెట్స్ వస్తాయి. కాసేపటికి సంజన రూమ్ కి ప్రియ, శ్రీజ వెళ్ళి హ్యాంపర్ నుండి చాక్లెట్స్ దొంగతనం చేస్తారు.
అదిలా ఉండగా రీతూ చాక్లెట్ తీసుకొని తింటుంది. కెప్టెన్ సంజన తనకి చిన్న ఫ్రిడ్జ్ నిండుగా కూల్ డ్రింక్స్ వస్తాయి. అవి చేతిలో పట్టుకొని ఎవరు నన్ను ఇంప్రెస్ చేస్తే వాళ్ళకోసమే ఇవి అని అంటుంది. ఎవరి బిజీలో వాళ్ళు ఉండగా హరీష్ వెళ్లి ఒక థమ్స్ అప్ తీసుకొని వచ్చి సోఫా కింద దాచేస్తాడు. కాసేపటికి ఒక కూల్ డ్రింక్ మిస్ అయింది. ఎవరు తీసుకున్నారని సంజన అడుగగా ఎవరు చెప్పరు. హరీష్ , ఫ్లోరా వాషింగ్ ఏరియాకి వెళ్లి థమ్స్ అప్ ని వాటర్ బాటిల్ లో పోసి ఖాళీ బాటిల్ ని డస్ట్ బిన్ లోపల వేస్తారు. ఆ వాటర్ బాటిల్ లో పోసిన కూల్ డ్రింక్ ని ప్రియకి ఇస్తాడు.
ఆ తర్వాత సంజన రూమ్ కి రీతూ వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అందులో కొంచెం, అందులో కొంచెం తాగి లోపల పెడుతుంది. ఆ తర్వాత సంజనని ఇంప్రెస్ చెయ్యడానికి అందరు కలిసి ఒక కామెడీ స్క్రిప్ట్ చేస్తారు. అందులో పర్ఫామెన్స్ బాగా చేసిన వాళ్ళకి థమ్స్ అప్ అనౌన్స్ చేస్తుంది సంజన. చివరకి వచ్చేసరికి ప్రొద్దున ఒక థమ్స్ అప్ ఎవరు తీశారు. అది ఇస్తే ఇవన్నీ అందరికి ఇచ్చేస్తానని అనగానే అందరికి కోపం వస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



