హౌజ్ లో మొదలైన నామినేషన్ల రచ్చ.. ప్రియాంక జైన్ కి ముదిరిన అటిట్యూడ్!
on Sep 19, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో హీటెడ్ నామినేషన్స్ సోమవారం రోజున జరిగాయి. హౌజ్ లో పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఉండగా అందులో ఏడుగురు నామినేషన్లో ఉన్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, శోభా శెట్టి, ఆట సందీప్ సేవ్ అయ్యారు. మిగిలిన వాళ్ళంతా నామినేషన్లో ఉన్నారు. నామినేషన్లో ప్రియాంక జైన్ మొదటగా స్టార్ట్ చేసింది. ' ఆ రోజు జరిగిన గొడవలో.. మీ ఇద్దరికి వినండని చెప్పాను. కానీ మీరు మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు' అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాని యావర్ ని ప్రియాంక జైన్ నామినేట్ చేసింది. ఇంటి పనులు తక్కువ చేస్తున్నావని గౌతమ్ కృష్ణని ప్రియాంక జైన్ నామినేట్ చేసింది.
టేస్టీ తేజని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. ఇక ప్రియాంక జైన్ , శుభశ్రీ దామిణి అందరూ కలిసి పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశారు. దామిణిని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. శుభశ్రీని శోభా శెట్టి నామినేట్ చేసింది. టూ వీక్స్ నుండి నామినేషన్ కి రాలేదు. సేఫ్ గేమ్ ఆడుతున్నావని అనిపిస్తుందని అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని శుభశ్రీని శోభా శెట్టి నామినేట్ చేసింది. సెకండ్ నామినేషన్ గా రతికని శోభా శెట్టి తనని నామినేట్ చేసింది. గౌతమ్ కృష్ణని అమర్ దీప్ ని నామినేట్ చేశాడు. ఆ రోటీ, ఆమ్లెట్ కాకుండా ఇంకేమైనా పనులు చేస్తే బాగుంటుందని గౌతమ్ కృష్ణని అమర్ దీప్ నామినేట్ చేశాడు. సెకండ్ నామినేషన్ గా శుభశ్రీని నామినేట్ చేశాడు అమర్ దీప్. నువ్వు రోటీ చేస్తున్నావ్, అక్కడే ఉంటున్నావని బయటకు రమ్మని శుభశ్రీని నామినేట్ చేశాడు అమర్ దీప్. అన్నిపనులు చేస్తే బాగుండని శుభశ్రీని రతిక నామినేట్ చేసింది. ఆడియన్స్ పరంగా ఉన్నావా లేవా అని అనుకుంటారను శుభశ్రీని ఉద్దేశించి రతిక అంది.
హౌజ్ లో ఇంక టైమ్ స్పెండ్ చేయాలనేది నా రీజన్ అని చెప్పి శుభశ్రీని నామినేట్ చేసింది రతిక. సెకండ్ నామినేషన్ గా గౌతమ్ కృష్ణని రతిక నామినేట్ చేసింది. ' ఫస్ట్ విను, నా అంతట నేను వచ్చి నాకు ఏదైనా కావాలా' అని గౌతమ్ కృష్ణతో రతిక అంది. ప్రిన్స్ యావర్ ని మొదట దామిణి నామినేట్ చేసింది. సెకండ్ నామినేషన్ గా శుభశ్రీని నామినేట్ చేసింది దామిణి. రతికరోజ్ ని గౌతమ్ కృష్ణని నామినేట్ చేశాడు. ఎందుకంటే సగం ప్రాబ్లమ్స్ నీ వల్లే జరిగాయని గౌతమ్ కృష్ణ అన్నాడు. అయిదుగురం మాట్లాడుకొని ఒక డీల్ కి వచ్చినప్పుడు మనం అని డిసైడ్ కావాలి కానీ నువ్వు పర్సనల్ గా నీ గురించి ఆలోచించావని రతికని గౌతమ్ కృష్ణ అన్నాడు. సెకండ్ నామినేషన్ గా అమర్ దీప్ ని గౌతమ్ కృష్ణ నామినేట్ చేశాడు. మీ టీమ్ వాళ్ళు చేసిన పనికి మేమ్ సంకనాకిపోయామని అమర్ దీప్ అన్నాడు. ప్రియాంక జైన్ ని శుభశ్రీ నామినేట్ చేసింది. టేస్టీ తేజని శుభశ్రీ నామినేట్ చేసింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
