
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో తొమ్మిదో వారం వీకెండ్ వచ్చేసింది. నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ చేసిన తప్పులని లేవనెత్తుతూ వారికి క్లాస్ పీకాడు నాగార్జున. అయితే ఈ వారం కంటెస్టెంట్స్ కు రివార్డ్ అండ్ రివేంజ్ థీమ్ తో టాస్కులు ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే కంటెస్టెంట్ల ఫ్యామిలీ ఫోటోలను చూపించి వారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాలని చెప్పాడు. దీంతో కంటెస్టెంట్స్ తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రామ్ ప్రసాద్ తన జీవితంలో జరిగినవి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.
మాది హ్యాపీ ఫ్యామిలీ.. వైజాగ్ లోనే పుట్టి పెరిగాను. బోలరాసి పార్వతమ్మ ఫ్యామిలీ అంటే మంచి పేరు. మా నాన్న వాళ్లు ఆరు మంది అన్నదమ్ములు..ఇద్దరు చెల్లెలు.. మొత్తం ఎనిమిది మంది. అంతా ఒకే వీధిలోనే ఉండే వాళ్లం.. దాదాపు 80 మంది ఉండేవాళ్లం. పొరపాటున ఒక్కరి బర్త్ డే జరిగినా సరే ఆ 80 మంది ఒకే ఇంటికి వెళ్తాము. ఆ ఖర్చు భరించలేక బర్త్ డేలు చేయడం కూడా మానేశామని చెప్పాడు. నేను చదువులో బాగా వీక్. అందుకే పదవ తరగతి వరకు చదివాను. ఆ తర్వాత మెడికల్ షాప్ లో రూ.500 జీతంతో ఐదు సంవత్సరాలు పనిచేశాను. నా స్నేహితులే నన్ను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లమని ఎంకరేజ్ చేశారు. దీంతో మల్టీమీడియా కోర్స్ పూర్తి చేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. అయితే ఇక్కడ నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డానని రామ్ ప్రసాద్ చెప్పాడు.
తన పర్సనల్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. నేను, నా భార్య మూడవ క్లాస్ నుంచే స్నేహితులం. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అయితే పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో సినిమా ఇండస్ట్రీని వదిలేస్తేనే అమ్మాయిని ఇస్తామన్నారు. దీంతో ఇండస్ట్రీ వదిలేసి మెడికల్ షాప్ లో నాకు అనుభవం ఉండడంతో మా మామయ్య నాకు డబ్బు ఇచ్చి బిజినెస్ పెట్టించాడు. అది కూడా బాగానే జరిగింది. హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలోనే బాబు పుట్టాడు. కానీ పుట్టిన పది రోజులకే బాబు బతకడని డాక్టర్లు చెప్పారని రామ్ ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నెలరోజుల పాటు బాబు హాస్పిటల్ లోనే గ్లాస్ బాక్స్ లో ఉంచి ట్రీట్మెంట్ చేశారని, ఆ సమయంలో తన గుండె ముక్కలైపోయిందని చెప్పాడు. ఆ తర్వాత తన భార్యకు న్యుమోనియా వచ్చి వెంటిలేటర్ పైకి వెళ్లిందని, నా లైఫ్ అంతా విషాదంగా మారిపోయిందని అనుకున్నానని రామ్ ప్రసాద్ చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.
రామ్ ప్రసాద్ చెప్పిన ఈ విషాద గాథ విని హౌస్ అంతా సైలెంట్ అయిపోయింది. తోటి కంటెస్టెంట్స్ అందరు అతడిని ఓదార్చారు. అందరిని నవ్వించే మనిషి వెనుక ఇంత పెద్ద కష్టం దాగి ఉందని ఎవరూ ఊహించలేదు. అన్ని కష్టాలను దాటుకుని జబర్దస్త్ ద్వారా స్టార్ కమెడియన్ గా ఎదిగిన రామ్ ప్రసాద్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో తన నిజమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నాడు. ఫ్యామిలీ ఫోటో టాస్క్ లో అతడి ఎమోషనల్ స్టోరీ ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. సోషల్ మీడియాలో కూడా రామ్ ప్రసాద్ కు మద్దతుగా నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
[Ram Prasad Emotional Story, Ram Prasad Life Struggles, Ram Prasad Family, Jabardasth Ram Prasad, Bigg Boss Ram Prasad, Bigg Boss Telugu 10, Bigg Boss 10 Telugu]






