Home

»

Tv News

BiggBoss 10 Telugu : వర్షిణిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వంశీ.. అతడిని డైరెక్ట్ నామినేషన్ చేసిన హోస్ట్!

Nov 22, 2026 10:59AM

బిగ్ బాస్ సీజన్-10 పదకొండో వారం వీకెండ్ వచ్చేసింది. ఇందులో నాగార్జున అదిరే లుక్ లో స్టేజ్ మీదకి వచ్చేశాడు. ఇక కెప్టెన్ అయిన అమన్ ని అభినందించాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ తో డిక్టేటర్స్ టాస్క్ ల గురించి మాట్లాడాడు. ఇందులో త్రిగుణ్ కి తొంభై మార్కులు ఇవ్వగా ముఖేష్ కి యాభై మార్కులు ఇచ్చాడు. 

ఆ తర్వాత వర్షిణి గురించి వంశీ మాట్లాడిన వీడియోను ప్లే చేసి చూపించాడు నాగార్జున. అతను మాట్లాడిన మాటల్ని మ్యూట్ చేసి మరీ వినిపించారంటే ఎంత దారుణంగా మాట్లాడాడో అర్థం చేసుకోవచ్చు. ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడుతుంటే.. ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు త్రిగుణ్. ఆ బిహేవియర్ ఏంటి? ఆ మాటలు ఏంటి? ఇంతకు ముందు కులకడం గురించి నువ్వు మాట్లాడినప్పుడు నేను నిన్ను సమర్థించాను. ఇది చూసి నేను తలదించుకుంటున్నా.. ఎందుకంటే నేను కూడా ఫిల్మ్ కమ్యునిటీ అని నాగార్జున అన్నాడు. సారీ సర్.. చాలా గిల్ట్‌గా ఉంది అని వంశీ అనడంతో.. గిల్ట్ కాదు అంటూ వర్షిణికి, ఆడియన్స్ కి, బిగ్ బాస్ కి క్షమాపణ చెప్పించాడు నాగార్జున.

మరి నీ దూతకి ఎలాంటి పనిష్మెంట్‌ ఇద్దామని త్రిగున్‌ని అడిగాడు నాగార్జున. కెప్టెన్సీ కంటెండర్‌గా రద్దు చేద్దాం సర్ అని త్రిగుణ్ అన్నాడు.  దాంతో నాగార్జున.. అది సరిపోదు.. ఏం చేద్దాం అమ్మా అంటూ వర్షిణిని అడిగాడు. దాంతో ఆమె..అతన్ని నేను అన్నా అనే అంటాను సర్.. ఆ పదం వాడిన తరువాత అతనితో మాట్లాడటం లేదని చెప్పింది. దాంతో నాగార్జున.. నిన్ను డైరెక్ట్‌గా నామినేట్ చేస్తున్నానని అన్నాడు. ఆ తరువాత రామ్ ప్రసాద్‌ని అభినందించారు. నీలో నాకు రియల్ రామ్ ప్రసాద్ కనిపించాడు.. ఇదే కంటిన్యూ చెయ్ అని చెప్పాడు. 

 

 

[Bigg Boss 10 Telugu Vamshi Direct Nomination Varshini Comments, Nagarjuna Angry Vamshi Vulgar Comments Varshini, Bigg Boss 10 Telugu Weekend Episode Vamshi Punishment, Vamshi Apologizes Varshini Bigg Boss 10, Bigg Boss 10 Telugu Week 11 Vamshi Nomination]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com