Home

»

Tv News

Bigg Boss 10 Telugu: డిక్టేటర్ టాస్క్ గెలిచి అమన్ ని స్వాప్ చేసుకున్న త్రిగుణ్.. పాపం నీతూ!

Nov 20, 2026 9:58AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో.. పదకొండో వారం డిక్టేటర్స్ గేమ్స్ కొనసాగాయి.  ఆధిపత్య పోరు సాగింది. త్రిగుణ్ వర్సెస్ ముఖేష్ టాస్క్ లు సాగుతున్నాయి. టాస్క్ గెలిచి బెడ్ రూమ్ ఏరియాని త్రిగుణ్ దక్కించుకోగా నిన్నటి ఎపిసోడ్ లో కిచెన్ ఏరియా కోసం టాస్క్ లు జరిగాయి. ఇక ఒక గేమ్ తర్వాత ముఖేష్, త్రిగుణ్ డిక్టేటర్స్‌గా తమ టీమ్‌లను స్ట్రాంగ్, వీక్ అంటూ విభజించాల్సి వచ్చింది. అక్కడే అసలు రచ్చ మొదలైంది.ముఖేష్ తన టీమ్‌లో రామ్ ప్రసాద్ వీకెస్ట్ అని, నరేష్ వీక్ అని, వర్షిణి స్ట్రాంగ్ అని, అమన్ స్ట్రాంగెస్ట్ అని ప్రకటించాడు. మరోవైపు త్రిగుణ్ తన టీమ్‌లో శివ స్ట్రాంగెస్ట్ అని, దేబ్జానీ స్ట్రాంగ్ అని, నీతూ వీక్ అని, వంశీ వీకెస్ట్ అని పేర్కొన్నాడు.

అయితే వర్షిణిని ముఖేష్

స్ట్రాంగ్ అనడంపైనే అందరి మీ డౌట్ వచ్చింది. నరేష్.. రామ్ ప్రసాద్, దేబ్జానీ మాట్లాడుకున్నారు. వర్షిణి స్ట్రాంగ్ ప్లేయర్ అని ముఖేష్ చెప్పాడు. ఇంత సడెన్‌గా వర్షిణి స్ట్రాంగ్ ఎలా అయింది అబ్బా అంటూ నరేష్ సెటైరికల్‌గా రామ్ ప్రసాద్ తో అన్నాడు. దాంతో అక్కడున్న వాళ్లంతా పగలబడి నవ్వారు.వంశీని వీకెస్ట్ అనడంపైనా ముఖేష్ త్రిగుణ్ ఆటను డీకోడ్ చేసే ప్రయత్నం చేశాడు. వంశీని ఎవరైనా వీక్ పెడతారా? ఎవరిని బక్రా చేయాలని అనుకుంటున్నాడంటూ కామెంట్ చేశాడు.ఇంతలో బిగ్ బాస్ త్రిగుణ్‌కి ఓ ఆఫర్ ఇచ్చాడు. నీ టీంలోని ఓ కంటెస్టెంట్‌ను అవతలి టీం నుంచి స్వాప్ చేసుకోవచ్చని అన్నాడు. దీనితో త్రిగుణ్ నీతూని అటువైపు పంపి అమన్‌ని తన టీంలోకి తీసుకున్నాడు.

నీతూ పాపం హర్ట్ అయింది. త్రిగుణ్ డిక్టేటర్ కాబట్టి అతను చెప్పింది ఫాలోవర్స్ ఫాలో అవ్వాలి..‌ఇది బిగ్ బాస్ రూల్.. కానీ నీతూ దానిని పాటించకుంటా త్రిగుణ్ కి వ్యతిరేకంగా మాట్లాడేసరికి అతను అదే రీజన్ చెప్పి నీతూని ముఖేష్ టీమ్ కి పంపి.. అమన్ ని తన టీమ్ లోకి స్వాప్ చేసుకున్నాడు. దీంతో శివ్, అమన్ , దేబ్జానీ, త్రిగుణ్, వంశీలతో  స్ట్రాంగ్ గా ఉంది. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com