
బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ లో ముఖేష్ వర్సెస్ త్రిగుణ్ జరిగింది. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో కంటెండర్స్‌గా పాల్గొనేందుకు బిగ్ బాస్ ఒక అవకాశం కల్పించారు. త్రిగుణ్, ముఖేష్‌లని డిక్టేటర్స్‌గా ఎంపిక చేశారు. ఈ వారం గేమ్‌లో ఎవరు పైచేయి సాధిస్తే వాళ్లకు టికెట్ టు ఫినాలే కంటెండర్స్‌గా పాల్గొనే అవకాశం దక్కుతుందని బిగ్ బాస్ తెలిపారు.
త్రిగుణ్, ముఖేష్ మధ్య డిక్టేటర్స్ గేమ్ మొదలైంది. ముందుగా బిగ్ బాస్ త్రిగుణ్, ముఖేష్ మధ్య రంగు పూసుకునే గేమ్ పెట్టారు. బజర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు ఒకరి టీ షర్ట్ పై మరొకరు రంగు పూసుకోవాలి. ఎవరి షర్ట్ పై రంగు ఎక్కువ ఉంటే వాళ్ళు ఓడిపోయినట్లు. 3 రౌండ్లలో జరిగిన ఈ టాస్క్‌లో ముఖేష్ విజయం సాధించాడు. దీనితో డిక్టేటర్‌గా అతడికి బిగ్ బాస్ అడ్వాంటేజ్ ఇచ్చాడు. తన ఫాలోవర్స్‌ని తనే ఎంచుకునే అవకాశం కల్పించారు. దీంతో ముఖేష్ తన టీం సభ్యులుగా వర్షిణి, రామ్ ప్రసాద్, నరేష్, అమన్, సుధీర్, ఆర్కేలని ఎంచుకున్నాడు. మిగిలిన వాళ్ళు త్రిగుణ్ టీమ్ లోకి వెళ్లారు. త్రిగుణ్ టీంలో నీతూ, శివ్ కుమార్, దేబ్జానీ, వంశీ ఉన్నారు.
ఆ తర్వాత జరిగిన టాస్క్‌లో త్రిగుణ్ టీమ్ విజయం సాధించింది. దీనితో ముఖేష్ టీం నుంచి ఒకరిని తొలగించే అవకాశం త్రిగుణ్‌కి దక్కింది. సంచాలకుడిగా పక్షపాతం చూపించిన సుధీర్‌ని తొలగిస్తున్నట్లు త్రిగుణ్ తెలిపాడు. వాస్తవానికి తను వర్షిణిని తీసేద్దామని అనుకున్నానని.. కానీ సంచాలకుడిగా సుధీర్ మోసం చేయాలని చూశాడు.. అందుకే అతడిని తప్పించినట్లు త్రిగుణ్ చెప్పాడు. దీంతో హౌస్‌లో మరోసారి రచ్చ మొదలైంది.




.webp)

