.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 పదకొండో వారం ఓటింగ్ ముగిసింది. ఈ వారం ఓటింగ్‌లో టాప్-2 లో త్రిగుణ్, ముఖేష్ హోరాహోరీగా పోటీ పడగా.. బాటమ్‌లో మాత్రం నలుగురు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో చిక్కుకున్నారు. ఆన్‌లైన్ ఓటింగ్ లెక్కల ప్రకారం త్రిగుణ్ - 30.78% (73,407 ఓట్లు), ముఖేష్ - 27.55% (65,700 ఓట్లు), అమన్ - 7.09% (16,906 ఓట్లు), దేబ్జానీ - 6.74% (16,070 ఓట్లు), సుధీర్ - 5.12% (12,209 ఓట్లు), రామకృష్ణ - 5.11% (12,179 ఓట్లు), వంశీ - 4.98% (11,869 ఓట్లు), రామ్ ప్రసాద్ - 4.81% (11,472 ఓట్లు), వర్షిణి - 4.48% (10,696 ఓట్లు), శివ - 1.76% (4,202 ఓట్లు), నీతూ - 1.60% (3,808 ఓట్లు) వచ్చాయి.
ఈ లెక్కల్లో డేంజర్ జోన్‌లో ఉన్న నలుగురు ఎవరంటే 1. నీతూ - 1.60%, 2. శివ - 1.76%, 3. వర్షిణి - 4.48%, 4. రామ్ ప్రసాద్ - 4.81%. నీతూ, శివలకు మిగిలిన వాళ్లతో పోలిస్తే చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య గ్యాప్ కూడా కేవలం 394 ఓట్లు మాత్రమే. దీనితో ఈ వారం ఎలిమినేషన్ ఈ ఇద్దరిలో ఒకరికే ఉంటుందని అంతా అనుకుంటున్నారు.అయితే వర్షిణి, రామ్ ప్రసాద్ కూడా సేఫ్ కాదు. వంశీ (4.98%), రామకృష్ణ (5.11%) తో పోలిస్తే వీళ్లు కాస్త వెనుకబడ్డారు. ఒక్కసారిగా ఓటింగ్ మారితే వర్షిణి లేదా రామ్ ప్రసాద్ కూడా డేంజర్ లో పడే ఛాన్స్ ఉంది. మరోవైపు టాప్‌లో త్రిగుణ్ 73 వేలకు పైగా ఓట్లతో నంబర్-1 లో ఉండగా.. ముఖేష్ 65 వేల ఓట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. కొత్త కెప్టెన్ అమన్ 3వ స్థానంలోకి వచ్చి తన గ్రాఫ్ పెంచుకున్నాడు.
ఫైనల్‌గా ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారు? నాగార్జున వీకెండ్‌లో డబుల్ ఎలిమినేషన్ చేస్తాడా లేదా నేది తెలియాలంటే శని, ఆదివారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






