Home

»

Tv News

BiggBoss 10 Telugu : అమన్ మసూద్ గురించి ఎవరికి తెలియని నిజాలు!

Nov 21, 2026 11:28AM

బిగ్ బాస్ సీజన్-10 తెలుగులో సత్తా చాటుతున్న కంటెస్టెంట్ అమన్ మసూద్. ఇతను 

హైదరాబాద్ కుర్రాడు.. ఫిట్‌నెస్ అథ్లెట్, మోడల్, పర్సనల్ ట్రైనర్‌గా తన కెరీర్ మొదలుపెట్టాడు. బీ.టెక్ మధ్యలోనే ఆపేసి థియేటర్, షార్ట్ ఫిల్మ్స్, మోడలింగ్ వైపు వెళ్లిన అమన్.. బిగ్ బాస్ తెలుగు 10 కోసం జరిగిన అగ్నిపరీక్ష సీజన్-2 లో అడుగుపెట్టాడు. 

 

జడ్జీలు అభిజీత్, బిందు మాధవి, నవదీప్ ముందు ఫిజికల్ టాస్క్‌లలో తన రా స్ట్రెంత్, ఎండ్యూరెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అగ్నిపరీక్షలో టాప్ ఓట్లతో గెలిచి సెప్టెంబర్ 6న బిగ్ బాస్ హౌస్‌లోకి 5వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ రోజే నాగార్జున ఇచ్చిన చిల్లులు ఉన్న టీ-షర్ట్ టాస్క్‌లో తడబడ్డా.. అగ్నిపరీక్షలో చూసింది ఒక్క కోణమే, హౌస్‌లో ఇంకా చాలా కోణాలు చూపిస్తా అంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.హౌస్‌లోకి వచ్చాక అమన్ జర్నీ అంత ఈజీగా సాగలేదు. మొదట్లో ఎవరూ సపోర్ట్ చేయకపోయినా.. ఒంటరిగానే తన దమ్ము చూపించాడు. డైరెక్ట్‌గా, ముఖం మీదే మాట్లాడే తత్వం, వెన్నుపోటు పొడవకపోవడం అతడికి ప్లస్ అయ్యింది. ఎపిసోడ్ 47 లో జరిగిన GOAT ఎండ్యూరెన్స్ టాస్క్‌లో అమన్ నిజమైన ఫైటింగ్ స్పిరిట్ చూపించాడు. భుజాలపై కర్రతో 52-53 కేజీల బరువు మోస్తూ చివరి వరకు నిలబడ్డాడు. నరేష్ చివరి వరకు ఉన్నా.. అతడికి ఎవరూ బరువు వేయలేదని బిగ్ బాస్ అమన్‌నే విన్నర్‌గా ప్రకటించాడు. దీనితో అమన్, దేబ్జానీ, నీతూ GOAT లుగా గ్రీన్ జోన్‌లోకి వెళ్లి రెండు వారాల ఇమ్యూనిటీ దక్కించుకున్నారు.

ఆ తర్వాత కూడా అమన్ గ్రాఫ్ పెరుగుతూనే వచ్చింది. వీక్-10 కెప్టెన్సీ రేసులో నరేష్‌తో 4-4 ఓట్లతో టై అయినా.. త్రిగుణ్ నిర్ణయంతో నరేష్ కెప్టెన్ అయ్యాడు. కానీ వీక్-11 డిక్టేటర్స్ టాస్క్‌లలో, బుద్ధిశాలి-బలశాలి టాస్క్‌లో ముకేష్ తప్పుడు నిర్ణయం చెప్పినా బిగ్ బాస్ జోక్యంతో అమన్ విన్నర్ అయ్యాడు. ఫైనల్ కెప్టెన్సీ టాస్క్‌లో బ్లాక్స్ నిలబెట్టి పడగొట్టడంలో నీతూ, దేబ్జానీ, శివకుమార్‌లను వెనక్కి నెట్టి కొత్త కెప్టెన్‌గా గెలిచాడు. దీనితో పాటు అల్టిమేట్ పవర్ - టికెట్ టు ఫినాలే కంటెండర్ ఛాన్స్ కూడా దక్కించుకున్నాడు.అగ్నిపరీక్షలో టాప్ ఓటర్‌గా వచ్చినా.. హౌస్‌లో మొదట్లో అతడికి అంతగా గుర్తింపు రాలేదనే టాక్ ఉండేది. ఇప్పుడు కెప్టెన్ అయ్యాక, వీక్-11 ఓటింగ్‌లో 7.09% తో 3వ స్థానంలోకి వచ్చి తన సత్తా చాటాడు. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన 9 మందిలో ఇప్పుడు మిగిలింది అమన్, రామకృష్ణ మాత్రమే. అందులోనూ కెప్టెన్‌గా, టికెట్ టు ఫినాలే రేసులో ఉన్నది అమన్ ఒక్కడే. కామనర్‌గా వచ్చి.. కెప్టెన్‌గా ఎదిగిన అమన్ జర్నీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరి ఈ జర్నీ ఫినాలే వరకు వెళ్లి టైటిల్‌తో ముగుస్తుందా? చూడాలి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com