Home

»

Tv News

BiggBoss 10 Telugu: బిగ్ బాస్ ఇంట్లో హైపర్ ఆది పంచ్‌ల వర్షం!

Nov 16, 2026 8:37AM

బిగ్ బాస్ స్టేజ్ మీదకు హైపర్ ఆది వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆది వచ్చీ రాగానే అందం కాన్సెప్ట్ ఎంచుకున్నాడు. నరేష్.. నువ్వేదో చెప్పావ్.. అందం గురించి అని అడుగుతాడు. అసలు అందం మీద జీఎస్టీ పెడితే.. నాగ్ సర్ అందరి కంటే ఎక్కువగా కట్టాలి.. నేను లీస్ట్ కడతాను.. అసలు రామ్ ప్రసాద్ కట్టడు.. నరేష్ అయితే జీఎస్టీకే అర్హుడు కాదని కౌంటర్లు వేశాడు.

ఇన్ని సీజన్లు చూసి వచ్చా కానీ.. ఏ రోజు కూడా ఇంట్లోకి వెళ్లాలని అనిపించలేదు.. కానీ ఒక్క రోజు అయినా వెళ్లాలని అనుకున్నా.. ఒక్క రోజు ఉంటే వీళ్లు పది హేను లక్షలు ఇప్పించి పంపిస్తారు సర్ అని ఆది కౌంటర్లు వేశాడు. మిథిలేష్ బయటకు వచ్చి.. రామ్ ప్రసాద్ ఫిట్నెస్ సెంటర్.. అమన్ ఆశీస్సులతో అని పెట్టుకున్నాడు.. ఆ ఒక్క రోజులోనే కండలు చూపించేలా చేశారు.. డ్యాన్స్ నేర్పించారు.. వర్షిణి అయితే కండలు చూపించేవాడు పోయాడే అని బాధ పడిందని ఆది చెప్పాడు.

స్కూల్ టాస్కులో వంశీ, సుధీర్ పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడిలా.. త్రిగుణ్ అన్న అయితే "స్పైడర్" సినిమాలో 'ఎస్ జే సూర్య' లా.. అమన్ అయితే ఫెయిల్ అయి ఒకే క్లాసులో ఉన్నవాడిలా.. జంబలకిడి పంబలో ఇదర్ ఆయియే అనేవాడిలా ముఖేష్ ఉన్నాడని కౌంటర్లు వేశాడు. నాకు ఏ అంటే ఆపిల్, బీ అంటే బ్యాట్ అని తెలుసు.. కానీ వీళ్లు అనుకునే బీ అంటే పీ అంటే ఏంటో తెలీదు.. ఈ పదో సీజన్ పది కాలాల పాటు ఉంటుంది.. ఎక్కుతున్నారు.. కక్కుతున్నారు.. మెక్కుతున్నారని అందరి గురించి ఆది చెప్పాడు.త్రిగుణ్ గురించి చెప్తూ.. ఒకడు నీకు ఎదురు పడినా నువ్వు వాడికి ఎదురు పడినా.. వాడికే రిస్క్.. ఒక్కడ్నే అని చెప్పుకుంటూ వచ్చావ్.. ఒక్కడ్ని కూడా వదల్లేదు.. నక్క, కప్ప అంటావ్.. ఎప్పుడు ఆడతావో ఎప్పుడు ఎవరి మీద పడతావో అర్థం కావడం లేదు.. కర్రకి ఆయిల్ రాసుకుని కొట్టేసుకుంటున్నారు ఆడియన్స్.. నీ కోసం యజ్ఞాలు, పూజలు, నువ్వు అర్థం కావాలని చేస్తున్నారు.. ఒకప్పుడు గూగుల్లో త్రిగుణ్ అని కొడితే.. హీరో అని వచ్చేది.. ఇప్పుడు కొడితే.. ఏం రావడం లేదు.. గూగుల్‌ని కూడా మానిప్యులేట్ చేస్తున్నావని ఎలివేషన్ ఇచ్చాడు. అగ్ని పరీక్ష దాటి వస్తే చాలని అంతా అనుకున్నారు.. కానీ నువ్వు లోపల పెట్టే పరీక్షలు ఉంటాయని వాళ్లకి తెలీదని షాలినీ, రోహిత్, అపూర్వ ఇలా అందరి గురించి ఇన్ డైరెక్ట్‌గా ఆది చెప్పేశాడు. వర్షిణి, ముఖేష్ గురించి కలిపి చెప్తా.. ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్.. ఆటలో పులిహోర కాదు.. ఆటే పులిహోర అని ఇద్దరి మీద పంచ్ వేశాడు ఆది. ఇలా ఆది పంచ్ లతో హౌస్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ హిట్ అయింది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com