Home

»

Tv News

Bigg Boss 10 Telugu :రంగు పూసుకునే టాస్క్ లో విజేత ఎవరంటే!

Nov 19, 2026 8:09AM

బిగ్ బాస్ ఇంట్లో ప్రస్తుతం పదకొండో వారం నామినేషన్స్ ముగిశాయి. ఈ వారం కెప్టెన్ నరేష్ తప్ప మిగిలిన వారంతా కూడా నామినేట్ అయ్యారు. అయితే ఇందులో ఫినాలే టికెట్ కొట్టడం అన్నది అందరి లక్ష్యంగా ఉంటుంది. ఇక ఆ టికెట్ సంపాదిస్తే ఓ రెండు వారాలు హాయిగా రిలాక్స్ అవ్వొచ్చు. ఆల్రెడీ ఫినాలే టికెట్ టాస్క్, అందులో పాల్గొనే వారి లిస్ట్‌ను బిగ్ బాస్ మెల్లిగా రెడీ చేసేలా కనిపిస్తున్నాడు. ఈ వారం అంతా గెలిచిన వాళ్లు వచ్చే వారం ఫినాలే టికెట్ రేసులో ఉంటారని అర్థం అవుతోంది.

బిగ్ బాస్ ఇంట్లో పదకొండో వారంలో టాస్కులు మొదలయ్యాయి. రెండు రోజులు నామినేషన్స్‌కి సంబంధించిన ఆర్గ్యూమెంట్స్ కనిపించాయి. డిక్టేటర్ అనే థీమ్‌లో భాగంగా మాజీ కంటెస్టెంట్లు వచ్చి నామినేషన్స్ చేశారు. ఇక ఈ వారం కెప్టెన్ నరేష్ తప్పా మిగిలిన వారంతా కూడా నామినేషన్‌లోకి వచ్చారు. అయితే బిగ్ బాస్ ఈ వారం వేసిన ప్లాన్ ఏంటో అర్థం అవుతోంది. ఈ వారం టాస్కులు పెట్టి.. గెలిచిన వారిని టికెట్ టు ఫినాలే రేసులో కంటెండర్లు చేయాలని అనుకుంటున్నాడు. ఇద్దరు శక్తివంతమైన డిక్టేటర్స్ ఉంటారు.. ఒకరికి అల్టీమేట్ పవర్ లభించబోతోంది.. నేరుగా టికెట్ టు ఫినాలే రేసుకి వెళ్లే మొదటి కంటెస్టెంట్‌గా నిలుస్తారు.. ఆటను శాసించే ఇద్దరు డిక్టేర్లు ముకేష్, త్రిగుణ్.. ఈ ఇద్దరి మధ్యే అధికార పోరు జరుగుతుంది.. బ్యాటిల్ ఆఫ్ డామినెన్స్ అని టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో ఇద్దరు వైట్ షర్ట్స్ ధరించాలి.. మూడు రౌండ్స్‌లో టాస్క్ జరుగుతుంది. ఎవరి షర్ట్‌కి ఎక్కువ రంగు పూసి ఉంటుందో.. వాళ్లు అవుట్ అని చెప్తాడు.

మొదటి రౌండ్ లో త్రిగుణ్ గెలవగా, రెండో రౌండ్ లో ముఖేష్ గెలిచాడు. ఇక చివరి రౌండ్‌లోనూ ఇద్దరూ తగ్గేదేలే అన్నట్టుగా పోటీ పడ్డారు. ఇద్దరి వైట్ షర్ట్స్ పూర్తిగా రెడ్ కలర్‌‌లోకి మారాయి. ఎవరి టీ షర్ట్ మీద రంగు ఎక్కువగా ఉందన్నది చూసి చివరి రౌండ్‌కి సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వంశీ, రామ్ ప్రసాద్ కలిసి సంఛాలక్ గా ఉన్నారు. ఇక ఈ గేమ్ లో గెలిచి అల్టిమేట్ పవర్‌ను సాధించాడు ముఖేష్.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com