Home

»

Tv News

BiggBoss 10 Telugu:క్యాటరింగ్ బాయ్ టు బిగ్ బాస్.. రామకృష్ణ రియల్ లైఫ్ స్టోరీ!

Nov 19, 2026 8:05AM

బిగ్ బాస్ సీజన్-10 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నవరసాల రామకృష్ణ గురించి ఎవరికి తెలియని నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరిలో వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు రామకృష్ణ. చిన్నప్పటి నుంచే ఆర్థిక ఇబ్బందులు అతడిని వెంటాడాయి. చదువు కోసం క్యాటరింగ్ బాయ్‌గా పని చేస్తూ తన ఖర్చులను తానే భరించాడు. రోజువారీ కూలీ పని నుంచి బిగ్ బాస్ స్టేజ్ వరకు అతడి ప్రయాణం ఎంతో మంది యువతకు స్ఫూర్తి.రామకృష్ణ అసలు కల పోలీస్ ఆఫీసర్ అవ్వాలని. అందుకోసం కాకినాడలో నాలుగేళ్ల పాటు కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నాడు. మోస్తరు హాస్టల్‌లో ఉంటూ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం కష్టపడ్డాడు. అదే సమయంలో అతడిలో కంటెంట్ క్రియేషన్ పట్ల ఆసక్తి పెరిగింది.

క్యాటరింగ్ పనితో వచ్చిన డబ్బుతో ఫోన్ కొనుక్కుని 2021 జూలై 21న 'నవరసాల మావ RK' అనే యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు. పల్లెటూరి జీవితం, మనుషుల ఎమోషన్స్‌ని తన వీడియోల్లో చూపించాడు.బిగ్ బాస్‌లోకి రావడం కోసం అగ్నిపరీక్ష సెలక్షన్ ప్రాసెస్‌లో పాల్గొన్నాడు. అందులో తన డెడికేషన్ నిరూపించుకోవడం కోసం "తూ నా బతుకు" అని పర్మినెంట్ టాటూ వేయించుకున్నాడు. పోలీస్ కెరీర్‌పై దాని ప్రభావం పడుతుందని తెలిసినా వెనక్కి తగ్గలేదు.ఎన్నోసార్లు రిజెక్ట్ అయినా, మొదటి లాంచ్‌లో అవకాశం రాకపోయినా రామకృష్ణ వదల్లేదు. చివరకు అక్టోబర్ 11న హోస్ట్ నాగార్జున చేతుల మీదుగా 5వ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ 10 లోకి ఎంట్రీ ఇచ్చాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com