Home

»

Tv News

Bigg Boss 10 Telugu: పదో వారం శ్వేత ఎలిమినేటెడ్.. తను ఏం చెప్పిందంటే!

Nov 16, 2026 8:40AM

బిగ్ బాస్ పదో వారంలో చివరకు సుధీర్, రామ్ ప్రసాద్, శ్వేత సేఫ్ కాకుండా మిగిలిపోయారు. అందులో శ్వేత ఎలిమినేట్ అయినట్టుగా తెలియడంతో రాం ప్రసాద్, సుధీర్ కాస్త రిలాక్స్ అయ్యారు. కానీ శ్వేతని పట్టుకుని అమన్ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. స్టేజ్ మీదకు వచ్చిన శ్వేత తన జర్నీని చూసుకుని ఎమోషనల్ అయింది.

ఆ తర్వాత నాగార్జున ఓ టాస్క్ ఇచ్చాడు. సూపర్ మార్కెట్‌లోంచి మూడు ఐటంలు సెలెక్ట్ చేసుకో.. అవి ముగ్గురికి డెడికేట్ చేయ్.. ఎందుకో రీజన్స్ చెప్పమని నాగ్ టాస్క్ ఇస్తాడు. కత్తిని తీసుకుని అమన్ గురించి చెప్తుంది శ్వేత. అమన్.. వెరీ షార్ప్, స్మార్ట్, ప్యూర్, ఇన్నోసెంట్.. కత్తిని పాజిటివ్‌గా, నెగెటివ్‌గా వాడుతాం.. కానీ నేను హెల్దీ వేలో చెప్తున్నా.. నీకు నువ్వు సెల్ఫ్ లెస్‌గా ఉండు.. అవతలి వాళ్లతో సెల్ఫీష్‌గా ఉండు.. అదే నేను నీకు ఇస్తున్న సలహా.. స్మార్ట్‌గా ఆడు.. నువ్వు గెలవాలని, గెలిస్తే చూడాలని అనుకుంటున్నానని చెప్తుంది శ్వేత.

ఆ తర్వాత టైమ్ టు వేకప్ అని ఎంచుకుని దేబ్జానీకి ఇస్తున్నానని శ్వేత చెప్తుంది. మీ సొంత పర్సనాలిటీ, మీ సొంత నిర్ణయాలు నాకు కనిపించడం లేదు.. షీల్డ్‌లా రామన్న ఉంటున్నాడు.. సొంతంగా ఆడు.. లేడీ కంటెస్టెంట్లలో స్ట్రాంగ్‌గా నువ్వు ఉండాలని కోరుకుంటున్నానని శ్వేత అంది. నేను ఆల్రెడీ మేల్కొన్నా.. నా ఆట ఏంటో చూపిస్తానని దేబ్జానీ అంటుంది.స్టక్ రికార్డ్ అని ముఖేష్ గురించి శ్వేత చెప్తుంది. నీ ఆటను నీ చేతులతోనే పాడుచేసుకుంటున్నావ్.. సలహాలు ఇస్తే తీసుకో.. ఇంప్రూవ్ చేసుకోమని శ్వేత చెప్పింది. 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com