Home

»

Tv News

Bigg Boss 10 Telugu :అపూర్వ, షాలినీ,దక్షి రీఎంట్రీ.. బిగ్ ట్విస్ట్!

Nov 16, 2026 8:47AM

బిగ్ బాస్ సీజన్-10 పదో వారం పూర్తయింది. ఇక బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఇక పదకొండో వారంలో అయితే ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చేలా ఉన్నాయి. పదకొండో వారం నామినేషన్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయని తెలుస్తోంది.ఇంట్లోంచి వెళ్లిపోయిన పాత కంటెస్టెంట్లు వచ్చి నామినేట్ చేస్తారని టాక్ నడుస్తోంది.

షాలినీ, అపూర్వ, దక్షి ఇంకా కొంతమంది  కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేస్తారని అయితే వీరిలో అపూర్వ, షాలిని మాత్రం వారం పాటు హౌస్ లో ఉంటారని అది కూడా గెస్టులుగా ఉంటారని లీక్స్ చెప్తున్నాయి. పదకొండో వారం థీమ్ డిక్టేటర్లుగా ఉండనుందని, వీళ్లే డిక్టేటర్లుగా వ్యవహరించి నామినేషన్ ప్రక్రియను నడిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో రోహిత్ రీఎంట్రీ కూడా ఉంటుందని అంటున్నారు.షాలినీ, రోహిత్ ఇద్దరూ కూడా ఆడియన్స్ ఓట్లతో బయటకు వెళ్లలేదు. ఒకసారి షాలినీ ఎలిమినేషన్ వరకు వచ్చి సీక్రెట్ రూంలోకి వెళ్లింది. అక్కడి నుంచి ఇంట్లోకి వచ్చిన షాలినీ.. ఇంటి సభ్యుల మెజార్టీ ఓట్లతో బయటకు వెళ్లింది. రోహిత్ కూడా రెడ్ జోన్‌లోనే ఉండటం.. మెజార్టీ సభ్యుల ఓట్లతో బయటకు వెళ్లడం జరిగింది. రోహిత్‌ను బయటకు పంపించడంపై ఇప్పటికీ కొంత మంది ఆడియన్స్, అతని ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు.

రోహిత్ రీఎంట్రీ ఉంటుందని అంతా నమ్ముతున్నారు. అసలు పదో వారంలోనే రీ ఎంట్రీ ఉంటుందని ఆశపడ్డారు. కానీ అది జరగలేదు. ఇక పదకొండో వారంలో అయినా రోహిత్ రీ ఎంట్రీ ఉంటుందని అనుకుంటున్నారు. మరి రోహిత్ రీ ఎంట్రీ ఉంటుందా? ఉంటే వారం రోజుల పాటు గెస్ట్‌గా ఉంటాడా? లేదంటే అసలు రీ ఎంట్రీ అనేది కన్ఫమ్‌గా ఉంటుందా? లేదా? అన్నది కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.అయితే ఈ వారంలో అపూర్వ, షాలినీ ఇంట్లోకి వచ్చి ఉంటారని లీక్స్ వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉంది.. ఎంత వరకు అవుతుందన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com