.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 ఇప్పుడు పదకొండో వారం జరుగుతుంది. అంటే ఇక మరో నెలరోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. దీనితో ఇంట్లో ఉన్న సభ్యులు టికెట్ టు ఫినాలే కోసం, టాప్&5 లో చోటు దక్కించుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు శివాజీ టాప్- 5 లో ఉండబోయే వారి గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. శివాజీ బిగ్ బాస్ తెలుగు సీజన్-7 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. సెకండ్ రన్నరప్ గా నిలిచారు. ప్రస్తుతం బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా చేస్తున్నారు. అలీ హోస్ట్ గా చేస్తున్న అలీతో అల్లరి షోకి శివాజీ అతిథిగా వెళ్లారు. ఈ షోలో శివాజీ బిగ్ బాస్ తెలుగు 10 లో టాప్ లో ఎవరెవరు ఉంటారో జోస్యం చెప్పారు.శివాజీ అంచనాల ప్రకారం.. ముఖేష్, త్రిగుణ్, నరేష్, దేబ్జానీ తప్పనిసరిగా టాప్-5 లో ఉంటారు. ఇక ఐదవ వ్యక్తి ఎవరనేది స్పష్టంగా చెప్పలేదు. ఐదవ వ్యక్తిగా రామ్ ప్రసాద్, అమన్, వంశీ లలో ఎవరైనా ఉండొచ్చని అన్నారు.
అయితే శివాజీ లిస్ట్‌లో వర్షిణి పేరు మాత్రం చెప్పలేదు. అంటే వర్షిణిపై శివాజీకి అంతగా అంచనాలు లేవని అర్థం అవుతోంది. ఆడియన్స్ లో కూడా వర్షిణిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వర్షిణి కేవలం గ్లామర్ కోసమే హౌస్ లో ఉందా.. ఫిజికల్ టాస్క్ లలో ఆమె ప్రమేయం అస్సలు ఉండడం లేదంటూ విమర్శిస్తున్నారు. ముఖేష్ తో క్లోజ్ గా ఉండడం వల్ల కూడా వర్షిణికి స్క్రీన్ స్పేస్ లభిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.శివాజీ చెప్పిన లిస్ట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన అంచనా నిజమవుతుందా.. వర్షిణి టాప్ 5 లోకి వచ్చి అందరిని ఆశ్చర్యపరుస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.




.webp)
.webp)
