Home

»

Tv News

Bigg Boss 10 Telugu:త్రిగుణ్ మాస్టర్ మైండ్‌.. ముఖేష్ కి స్ట్రాంగ్ పోటీ!

Nov 20, 2026 9:47AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో డిక్టేటర్స్ మధ్య టాస్క్ లు సాగాయి. ముఖేష్, త్రిగుణ్ ఇద్దరూ డిక్టేటర్లుగా మారి హౌస్‌ లో రెండు టీమ్ లుగా మారారు..ముందుగా బిగ్ బాస్ ఇద్దరు డిక్టేటర్లకు కలర్ టాస్క్ ఇచ్చాడు. తెల్ల టీ-షర్టులు వేసుకుని ఒకరిపై ఒకరు రెడ్ పెయింట్ చల్లుకోవాలి. ఎవరి షర్ట్‌పై తక్కువ పెయింట్ ఉంటే వాళ్లే విన్నర్. మూడు రౌండ్ల పాటు జరిగిన ఈ టాస్క్‌లో త్రిగుణ్ తన టీ-షర్ట్‌ను షార్ట్స్‌లో దాచేసే ట్రిక్ కూడా వేశాడు. కానీ చివరికి ముఖేష్ గెలిచాడు.వంశీ, రామ్ ప్రసాద్ జడ్జ్‌లుగా ముఖేష్‌నే విన్నర్‌ అని చెప్పారు.

 

ఈ గెలుపుతో ముఖేష్‌కి ఆరుగురిని తన టీమ్‌లోకి తీసుకునే అడ్వాంటేజ్ వచ్చింది. ముఖేష్ తన టీమ్ లో రామ్ ప్రసాద్, వర్షిణి, నరేష్, సుధీర్, ఆర్కే, అమన్‌లను తీసుకున్నాడు. దీనితో ముఖేష్ టీమ్ ఏడు మందితో బలంగా కనిపించింది. త్రిగుణ్ టీమ్‌లో వంశీ, దేబ్జానీ, శివ, నీతూ మాత్రమే మిగిలారు.అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. బిగ్ బాస్ డిక్టేటర్ రూల్స్ చెప్పాడు. ఫాలోవర్లు డిక్టేటర్లకు సెల్యూట్ కొట్టాలి, వారి పేరుతో నినాదాలు చేయాలి, వారి ముందు నిలబడాలి. దీనిని త్రిగుణ్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తన ఫాలోవర్లను “త్రిగుణ్ అన్న దూత” అంటూ నినాదాలు చేయమని చెప్పాడు. ప్రతిసారి తను కనిపించినప్పుడు సెల్యూట్ కొట్టి దూత అనాలని రూల్ పెట్టాడు. ఇదే త్రిగుణ్ మాస్టర్ మైండ్‌కి అందరూ సలాం అంటున్నారు.ముఖేష్ మాత్రం భిన్నంగా వ్యవహరించాడు. మీరు నా సేవకులు కాదు, నా ఫ్యామిలీ అని తన టీమ్‌తో చెప్పాడు.ఆ తర్వాత జరిగిన టీమ్ టాస్క్‌లో పజిల్ పీసులతో దారి చేసి బాల్స్‌ని బాక్స్‌లోకి పంపాలి. ముఖేష్ టీమ్ నుంచి రామ్ ప్రసాద్, అమన్.. త్రిగుణ్ టీమ్ నుంచి నీతూ, శివ పాల్గొన్నారు. అమన్, శివ మధ్య ఫిజికల్‌గా గట్టి పోరు జరిగింది. చివరికి త్రిగుణ్ టీమ్ గెలిచింది.

 

గెలిచిన త్రిగుణ్‌కి ముఖేష్ టీమ్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసే పవర్ వచ్చింది. సంఛాలక్ గా బయాస్‌డ్‌గా వ్యవహరించాడని చెప్పి సుధీర్‌ను ఎలిమినేట్ చేశాడు. నిజానికి వర్షిణిని ఎలిమినేట్ చేయాలనుకున్నానని, కానీ సుధీర్ రిఫరీగా మానిప్యులేట్ చేశాడని త్రిగుణ్ చెప్పాడు.

 

SEO Keywords : 

 

Bigg Boss 10 Telugu Day 74 Episode, Mukesh Vs Trigun Dictators Battle, Trigun Anna Dootha Mastermind, Bigg Boss 10 Telugu November 19 Episode, Mukesh Wins Paint Task Trigun Wins Team Task, Bigg Boss 10 Telugu Ticket To Finale, Trigun Eliminates Sudheer, Mukesh Team Ram Prasad Varshini, Bigg Boss 10 Telugu Latest Update, Trigun Dootha Slogan

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com