.webp)
బిగ్ బాస్ తెలుగు 10 లో వైల్డ్ కార్డ్‌గా అడుగుపెట్టిన నీతూ నటరాజ్ అందరికీ నటరాజ్ మాస్టర్ భార్యగానే తెలుసు. కానీ ఆమె జర్నీ దానికంటే చాలా పెద్దది. పేరెంట్స్ గుజరాత్‌కు చెందిన వారైనా.. నీతూ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే పిచ్చి. ఆ పిచ్చితోనే ఆట-2 లాంటి డ్యాన్స్ రియాలిటీ షోలలో పాల్గొని తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. తెలుగు అమ్మాయి కాకపోయినా.. హైదరాబాద్‌లో పెరగడంతో తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది. డ్యాన్స్ షోల ద్వారానే ఆమెకు నటరాజ్ మాస్టర్ పరిచయం అయ్యాడు.
ఆట-2 షోలోనే నీతూ, నటరాజ్ మాస్టర్‌ల మధ్య ప్రేమ చిగురించింది. అప్పట్లో నీతూ తల్లి అనారోగ్యంతో ఉండగా.. డ్యాన్స్ షోల ద్వారా వచ్చే డబ్బుతోనే తల్లికి వైద్యం చేయించింది నీతూ. ఆ కష్టకాలంలో నటరాజ్ మాస్టర్ ఆమెకు అండగా నిలబడ్డాడు. చివరికి తల్లి కూడా ఒప్పుకోవడంతో 2009లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి లక్ష్య అనే కూతురు ఉంది. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి 200కు పైగా ఈవెంట్స్, టీవీ షోలు, ఆడియో, అవార్డు ఫంక్షన్లకు కొరియోగ్రఫీ చేశారు. నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ తెలుగు సీజన్-5 లో పాల్గొనగా.. ఇప్పుడు అదే హౌస్‌లోకి భార్య నీతూ అడుగుపెట్టడం విశేషం.
కెరీర్‌లో నీతూ కేవలం డ్యాన్సర్‌గానే కాకుండా కొరియోగ్రాఫర్, డ్యాన్స్ డైరెక్టర్‌గా ఎదిగింది. ఇటీవల ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ షోలో పాల్గొని మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ముఖం మీదే మాట్లాడే తత్వం ఆమె సొంతం. బిగ్ బాస్‌లోకి వచ్చింది కూడా భర్త పేరుతో కాదు.. తనకంటూ ఓ సొంత గుర్తింపు కోసమే అని నీతూ చెప్పింది. నటరాజ్ మాస్టర్ కల నెరవేర్చడానికి కూడా తాను హౌస్‌లోకి వచ్చానని ఇంటర్వ్యూల్లో చెప్పింది.హౌస్‌లోకి వైల్డ్ కార్డ్‌గా వచ్చాక నీతూ గేమ్‌లో చురుగ్గా ఉంటోంది. వీక్-11 కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో ముకేష్, ఆర్కేలను వెనక్కి నెట్టి కంటెండర్‌గా గెలిచింది. ఫిజికల్ టాస్క్‌లలో, కెప్టెన్సీ పోటీలో గట్టి పోటీ ఇస్తోంది. అయితే ఓటింగ్‌లో మాత్రం ప్రస్తుతం 1.60% తో లాస్ట్ ప్లేస్‌లో ఉండి డేంజర్ జోన్‌లో ఉంది. మరి డ్యాన్స్ మాస్టర్ నీతూ ఈ డేంజర్ జోన్ నుంచి బయటపడి తన సొంత గుర్తింపును నిలబెట్టుకుంటుందా చూడాలి మరి.






